Ebrahim Raisi Dead: హెలికాప్టర్ కూలిన ఘటన.. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం.. ఇరాన్ అధికారిక మీడియా వెల్లడి
ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న సాయంత్రం అజర్‌బైజన్ సరిహద్దుల్లోని జోల్ఫాలో కుప్పకూలిన విషయం తెలిసిందే.
Newdelhi, May 20: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) మృతిచెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ (helicopter) నిన్న సాయంత్రం అజర్‌బైజన్ సరిహద్దుల్లోని జోల్ఫాలో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ కూలిన ప్రాంతంలో ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవని కాసేపటి క్రితం ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. హెలికాప్టర్ కూలిన ప్రాంతం మొత్తం కాలిపోయిందని తెలిపింది. అందులో అధ్యక్షుడు రైసీతోపాటు విదేశాంగ మంత్రి అబ్దొల్లాహియాన్, అజర్ బైజాన్ గవర్నర్, ఇతర ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్నారు.
ఎవరీ ఇబ్రహీం రైసీ?
ఇరాన్ లో మతతత్వ పాలనను ప్రోత్సహించిన వ్యక్తిగా రైసీ నిలిచారు. 1988లో ఖైదీలను సామూహికంగా ఉరితీసినందుకు అమెరికా, ఇతర దేశాల నుంచి ఆయన ఆంక్షల్ని ఎదుర్కొంటున్నారు.2021 అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థులందర్నీ పక్కకు తప్పించి, తక్కువ ఓటింగ్‌తో రైసీ గెలుపొందటం వివాదాస్పదమైంది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్ని ఉక్కుపాదంతో రైసీ అణచివేశారు.