Iran Supreme Tweets: మిడిల్ ఈస్ట్ లో యుద్ధానికి వాళ్లే కార‌ణం, ఇరాన్ సుప్రీం లీడ‌ర్ సంచ‌ల‌న ట్వీట్లు, ఇజ్రాయెల్ కు ఎలా వార్నింగ్ ఇచ్చారంటే?

Iranian Supreme Leader Ali Khamenei (Photo Credits: X/@Khamenei_fa)

Iran, OCT 02: మిడిల్‌ ఈస్ట్‌ రీజియన్‌లో యుద్ధ వాతావరణం (Middle East War) కొనసాగుతున్న వేళ.. ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ (Ali Khamenei) సంచలన ఆరోపణలకు దిగారు. ప్రస్తుత సంక్షోభానికి కారణం ఎవరో చెబుతూ.. వరుస ట్వీట్లు (Khamenei Tweets) చేశారాయన. మిడిల్‌ ఈస్ట్‌లో అంతర్యుద్ధాలకు, యుద్ధాలకు.. అమెరికా, యూరోపియన్‌ దేశాలే కారణం. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన పేరిట వస్తున్నవాళ్ల సమక్షంలోనే ఇదంతా జరుగుతోంది. ఈ ప్రాంతం నుంచి ఆ శత్రుమూకలు గనుక వైదొలిగితే.. కచ్చితంగా ఈ అంతర్యుద్ధాలు, యుద్ధాలు ఆగిపోతాయి అని అన్నారాయన. అంతేకాదు.. ఇస్లామిక్‌ రెవల్యూషన్‌ స్ఫూర్తి.. ఇరాన్‌ ప్రజలు, మిత్రదేశాల సహకారంతో శత్రు సంహారం చేపడతామని ప్రతిజ్ఞ చేశారాయన.

Ali Khameni Tweet

 

ఇదిలా ఉంటే.. లెబనాన్‌లో హెజ్‌బొల్లాను (Hezbollah) లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ దాడులు జరిపింది. దీనికి ప్రతిగా ఇరాన్‌ 180 మిస్సైల్స్‌ను ఇజ్రాయెల్‌ మీదకు ప్రయోగించింది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ వైరంలో ఇదే అతిపెద్ద దాడి కావడం గమనార్హం. తమపై దాడులకు దిగితే గనుక టెహ్రాన్‌ వర్గాల నుంచి మరింత ధీటైన బదులు వస్తుందని ఇరాన్‌ రెవల్యూషన్‌ గార్డులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

Ali Khameni Tweet

 

అయితే ఇరాన్‌ తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ హెచ్చరించగా.. దాడులకు మిత్రపక్షం అమెరికా కూడా మద్దతు ప్రకటించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ

SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌ రెండ్రోజుల్లో పూర్తి చేస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన, రాజకీయం చేయడానికి హరీశ్‌రావు వచ్చారని మండిపాటు

TDP Office Attack Case: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని తెలిపిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి

New Zealand Beat Pakistan by 60 Runs: తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర ఓటమి, సెంచరీలతో అదరగొట్టిన విల్‌ యంగ్‌, టామ్‌ లేథమ్‌

Advertisement
Advertisement
Share Now
Advertisement