Ismail Haniyeh Dead: హమాస్‌ మిలిటెంట్‌ గ్రూపుకు భారీ షాక్, వైమానికి దాడిలో పొలిటికల్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా మృతి

ఇజ్రాయెల్‌తో గత ఏడాది కాలంగా యుద్ధం చేస్తున్న హమాస్‌ మిలిటెంట్‌ గ్రూపుకు భారీ షాక్ తగిలింది. హమాస్‌ పొలిటికల్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు.

Hamas' top leader, Ismail Haniyeh (Photo Credit: X/@abhijitmajumder)

ఇజ్రాయెల్‌తో గత ఏడాది కాలంగా యుద్ధం చేస్తున్న హమాస్‌ మిలిటెంట్‌ గ్రూపుకు భారీ షాక్ తగిలింది. హమాస్‌ పొలిటికల్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగిన వైమానిక దాడిలో హనియా మరణించాడని ఇరాన్‌ ప్రభుత్వంతో పాటు హమాస్‌ గ్రూపు కూడా ధ్రువీకరించింది.  ఇజ్రాయెల్-హెజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం, భారతీయులకు ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

ఈ వైమానిక దాడిలో హనియాతోపాటు ఆయన బాడీగార్డు కూడా మరణించాడని తెలిపాయి. లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో ఇరాన్‌ మద్దతు గల హెజ్బొల్లా టాప్‌ కమాండర్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్‌ మంగళవారం సాయంత్రం ప్రకటించిన కొద్ది గంటల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరాన్‌ కొత్త అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ప్రమాణ స్వీకారానికి హాజరై, ఇంటికి వచ్చిన తర్వాత ఈ వైమానికి దాడి జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement