Israel-Hamas War: గాజాపై 6వేల బాంబులు విసిరిన ఇజ్రాయిల్, వైట్ పాస్పరస్ ఆయుధాలతో భారీ అటాక్, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే..
ఇజ్రాయిల్ దానికి కౌంటర్ అటాక్(Israel Attack) మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ భీకర దాడులు చేసింది. అయితే గత శనివారం నుంచి జరుగుతున్న దాడుల్లో సుమారు ఆరు వేల బాంబులను వాడినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయిల్ మీద రాకెట్లతో హమాస్ మెరుపు దాడి చేసిన నేపథ్యంలో.. ఇజ్రాయిల్ దానికి కౌంటర్ అటాక్(Israel Attack) మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ భీకర దాడులు చేసింది. అయితే గత శనివారం నుంచి జరుగుతున్న దాడుల్లో సుమారు ఆరు వేల బాంబులను వాడినట్లు తెలుస్తోంది.
కేవలం గాజాపైనే ఆరు వేల బాంబులు వేసినట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. ఆ బాంబులు దాదాపు 4వేల టన్నులు ఉన్నట్లు తెలుస్తోంది. గాజాలో ఉన్న హమాస్ ప్రాంతాలపై బాంబులతో ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది. తమ వైమానిక దళం సుమారు 3600 టార్గెట్లను అటాక్ చేసినట్లు ఇజ్రాయిల్ వైమానిక దళం పేర్కొన్నది.
ఈ క్రమంలో తెల్ల భాస్వరంతో కూడిన ఆయుధాలను ఇజ్రాయెల్ ఉపయోగిస్తోందని లెబనాన్ మానవ హక్కుల సంఘం ఆరోపించింది. అటువంటి ఆయుధాలను ఉపయోగించడం వల్ల పౌరులు తీవ్రమైన, దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ దళాలు.. తాము తెల్ల భాస్వరంను ఉపయోగించలేదని స్పష్టం చేశాయి.
అక్టోబర్ 10, 11 తేదీల్లో పేలిన పలు బాంబులకు సంబంధించిన వీడియోలను లెబనాన్ మానవ హక్కుల సంఘం పరిశీలించింది. గాజా ఎయిర్‌పోర్టుతో పాటు ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుకు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో రెండు చోట్ల తెల్ల భాస్వరం ప్రయోగించినట్లు ఆరోపించింది. వెలువడిన తెల్లని పొగలు వైట్ పాస్పరస్‌కు సంబంధించినవేనని అనుమానం వ్యక్తం చేసింది.
155 మీమీ తెల్లభాస్వరానికి సంబంధించిన ఫిరంగి ఆనవాళ్లను గుర్తించినట్లు ఆరోపించింది. ఈ వీడియోలకు సంబంధించిన దృశ్యాలను పాలస్తీనా టీవీ ఛానళ్లు కూడా బహిర్గతపరిచాయి.అయితే తెల్ల భాస్వరం ఉపయోగంపై తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రస్తుతం ఇజ్రాయెల్ చెబుతోంది.
తెల్లభాస్వరానికి సంబంధించిన ఆయుధాలను పొగలు వెలువడేలా చేసి శత్రువులను దారి మళ్లించేలా ఉపయోగపడుతుంది. కానీ దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల ప్రబలుతున్న నేపథ్యంలో తెల్ల భాస్వరాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. చాలా వేగంగా అంటుకునే గుణం ఉన్న ఆ రసాయనాన్ని.. సాధారణంగా మిలిటరీ వాడుతుంది.
వైట్ పాస్పరస్ వల్ల శరీరం కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆయుధంగా ఆ రసాయనాన్ని వాడితే ప్రమాదాలు తీవ్రంగా ఉంటాయి. జన సాంద్రత ఉన్న ప్రదేశాల్లో ఆ రసాయనాన్ని ఎక్కువగా వాడుతుంటారు. వైట్ పాస్పరస్ వాడడం లేదని ఇజ్రాయిల్ పేర్కొన్నా.. కొన్ని వార్తా సంస్థలు తీసిన ఫోటోల్లో ఆ రసాయనాన్ని వాడినట్లు అర్థమవుతోంది.ఆక్సిజన్‌తో కలిసినప్పుడు వైట్ పాస్పరస్ మండుతుంది. ఆ మంటతో తెల్ల పొగ కమ్ముకుంటుంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆ రసాయనాన్ని బ్యాన్ చేయలేదు. కానీ ఆ రసాయనం వల్ల మనుషులకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో స్మోక్ అటాక్ కోసం వైట్ పాస్పరస్‌ను ఇజ్రాయిల్ వాడింది.