హ‌మాస్ ఉగ్ర‌వాదులు త‌ల‌దాచుకున్న స్థావ‌రాల‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు(Israel Warplanes) వేగవంతం చేసింది. ఉగ్ర‌వాదులు ఉన్న అయిదు ఇండ్లపై .. వైమానిక ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. ఇజ్రాయిల్‌కు చెందిన యుద్ధ విమానాలు.. ఉగ్ర‌వాదులు దాచుకున్న అయిదు ఇండ్ల‌ను పేల్చివేశాయి. దానికి సంబంధించిన వీడియోల‌ను ఇజ్రాయిల్ రిలీజ్ చేసింది.

మానిట‌రింగ్ సెంట‌ర్‌తో పాటు ఆప‌రేష‌న‌ల్ హౌజ్ కేంద్రాల‌పై ఇజ్రాయిల్ వైమానిక ద‌ళాలు అటాక్ చేశాయి. ఆ దాడుల్లో అనేక మంది సీనియ‌ర్ హ‌మాస్ స‌భ్యులు హ‌త‌మైన‌ట్లు తెలుస్తోంది. గాజాలోని హ‌మాస్ నేత య‌హియా సిన్వార్ సోద‌రుడు కూడా ఆ దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఇజ్రాయిల్, హ‌మాస్ దాడుల వ‌ల్ల ఇండ్ల‌ను వ‌దిలి వెళ్తున్న వారి సంఖ్య 4, 23,378 కి చేరుకున్న‌ది. గాజా స్ట్రిప్‌లో ఉన్న 21 శాతం జ‌నాభా వ‌ల‌స‌బాట ప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)