Israel-Palestine War: పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ప్రకటించిన అమెరికా మిత్ర దేశాలు, రఫాలో అసలేం జరిగింది, అమాయకుల మృతిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర విచారం
60 మందికి గాయాలయ్యాయి.
Rafah, May 29: గాజా స్ట్రిప్‌లోని దక్షిణ నగరం రఫాలో పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్న క్యాంపుపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసిన సంగతి విదితమే.తాజాగా ఇజ్రాయెల్ సైన్యం అక్కడ బాంబుల వర్షం కురిపించడంతో రఫాలో 45 మంది మృతిచెందారు. 60 మందికి గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే. ఇప్పటివరకు గాజా పోరులో అత్యంత పాశవికమైన దాడుల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు. ఈ దాడికి సంబంధించి హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. కాగా, వీరి మృతిపై ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. వారి మరణాలకు తాము కారణంకాదని ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది.
కాగా, రఫాలో జరిగిన దాడులపై ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఇజ్రాయెల్ మంగళవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఆర్మీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ..‘రఫాలో ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. రఫాలో ఇద్దరు సీనియర్ హమాస్ కమాండర్లు యాసిన్ రబియా, ఖలీద్ నజ్జర్‌ను లక్ష్యంగా చేసుకుని మాత్రమే దాడులు జరిగాయి. ఈ దాడి కోసం చాలా చిన్న ఆయుధాలు ఉపయోగించడం జరిగింది. ఇజ్రాయిల్ పై అమెరికా మండిపాటు! హమాస్ తో పోరులో సామాన్యుల ప్రాణాలు బలితీసుకుంటారా? ఆ దృశ్యాలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయంటూ ఆవేదన
అయితే, ఈ క్రమంలో అనుకోకుండా మంటలు చెలరేగాయి. అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సందర్బంగా హమాస్ నేతలు దాచిన మందుగుండు సామాగ్రి పేలిన కారణంగానే పెద్ద ప్రమాదం జరిగి గుడారాల్లోని ప్రజలు చనిపోయారు. అంతేకానీ, మేము చేసిన దాడుల కారణంగా కాదు. ఇజ్రాయెల్ దాడులు కేవలం హమాస్ నేతల కోసమేనని.. గాజా ప్రజల కోసం కాదు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఈ దాడిలో అమాయక పాలస్తీనియన్లు చనిపోవడం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తప్పు చేశామని పార్లమెంటులో ప్రకటన చేశారు. సాధారణ పౌరులకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ఈ విషాదకర ఘటన జరిగింది. దీనిపై దర్యాప్తు చేస్తాం’’ అని పేర్కొన్నారు. అలాగని అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతిమ విజయం సాధించేవరకు యుద్ధం ఆపబోమని తెలిపారు. ఇజ్రాయెల్ పై హమాస్ రాకెట్ల వర్షం.. డజన్ల కొద్దీ మృతి.. జనవరి తర్వాత ఇదే తొలిసారి
మరోవైపు హమాస్ కమాండర్లు ఉన్నారన్న సమాచారంతోనే దాడి చేశామని.. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని ఒకవైపు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలిచ్చినా, మరోవైపు అమెరికా సహా ప్రపంచమంతా కోరుకుంటున్నా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో.. సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెలే ప్రకటించిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతంలో దాడులు జరిపింది. అప్పటికే అక్కడ గుడారాలు వేసుకుని ఉన్న పాలస్తీనా ప్రజలు మృతి చెందారు.
ఇక గాజాపై మే నెలలో ఇజ్రాయెల్ దాడి ప్రారంభమైనప్పటి నుండి ఒక మిలియన్ మంది ప్రజలు రఫా నుండి పారిపోయారు. ఇక, అమెరికా, ఇతర మిత్రదేశాలు రఫాపై పూర్తి స్థాయి దాడికి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా హెచ్చరించాయి. ఇజ్రాయెల్ దాడులను ఖండించింది. మరోవైపు.. రఫాపై దాడిని ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం ఇజ్రాయెల్‌ను కోరింది.
ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, ఫ్రాన్స్ సహా స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, నార్వే, ఈజిప్టు, ఖతార్, తుర్కీయేలు తీవ్ర స్వరంతో ఖండించాయి. ‘‘ఈ ఆపరేషన్లను ఆపాలి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. తక్షణం కాల్పుల విరమణ పాటించాలి’’ అని ‘ఎక్స్’ వేదికగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ పేర్కొన్నారు. ‘‘భూమి మీద ఉన్న నరకం గాజా, గత రాత్రి జరిగిన దాడి ఇందుకు మరో సాక్ష్యం’’ అని పాలస్తీనా శరణార్థులకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి సంస్థ యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ పేర్కొంది.
గాజాలో సంక్షోభం తారస్థాయికి చేరిన వేళ, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా మంగళవారం నుంచి అధికారికంగా గుర్తిస్తున్నట్లు స్పెయిన్, నార్వే, ఐర్లాండ్ ప్రకటించాయి. పాలస్తీనీయన్లు, ఇజ్రాయెలీలు శాంతిని సాధించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని మంగళవారం స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తెలిపారు.
ఐర్లాండ్ కూడా ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఆ దేశ పార్లమెంటు భవనంపై పాలస్తీనా జెండా ఎగరవేశారు. నార్వే కూడా అధికారికంగా గుర్తిస్తున్నట్లు పేర్కొంది. ఐరోపా దేశాలు తీసుకున్న ఈ నిర్ణయంపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూదులకు వ్యతిరేకంగా నరమేధానికి పాల్పడుతున్న శక్తులకు ఊతమివ్వడంపై మండిపడింది. పాలస్తీనాను ఇప్పటికే 140కి పైగా దేశాలు గుర్తించాయి. ఐరోపాలోని కీలక దేశాలైన ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ తదితర దేశాలు మాత్రం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలను చేపట్టిన విదేశీ విద్యార్థులను అధికారంలోకి వచ్చిన తర్వాత వారి స్వదేశాలకు పంపించేస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. న్యూయార్క్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ కార్యక్రమంలో దాతలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వారి ప్రవర్తనకు మూల్యం చెల్లించుకొంటారని హెచ్చరించారు.