UN Panel on Nithyananda 'Kailasa': నిత్యానందకు షాకిచ్చిన ఐక్యరాజ్యసమితి, కైలాస దేశ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోబోమని వెల్లడి
స్వయం ప్రకటిత సంస్థల ప్రతినిధులు అందించిన సమాచారాన్ని తాము పరిగణనలోకి తీసుకోబోమని (UN Panel on Nithyananda 'Kailasa') యుఎన్ స్పష్టం చేసింది
ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ప్రసంగించామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కైలాస దేశ ప్రతినిధులకు ఐక్యరాజ్యసమితి షాకిచ్చింది. స్వయం ప్రకటిత సంస్థల ప్రతినిధులు అందించిన సమాచారాన్ని తాము పరిగణనలోకి తీసుకోబోమని (UN Panel on Nithyananda 'Kailasa') యుఎన్ స్పష్టం చేసింది.UNO సమావేశాల్లో ఎవరైనా పాల్గోవచ్చని, రాతపూర్వకంగా తమ అభిప్రాయం చెప్పొచ్చని (Kailasa participated as NGO) పేర్కొంది.
దీని వల్ల వేర్వేరు వ్యక్తుల వ్యక్తిగత, లేదంటే వివిధ సంఘాల ప్రతినిధుల అభిప్రాయం తెలుసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొంది. కైలాస దేశ ప్రతినిధులు కూడా NGOలుగా పరిగణిస్తున్నామని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి రూపొందించే ప్రణాళికల్లో వాటిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుందని, అంతే తప్ప వ్యక్తపరిచిన అభిప్రాయాలను యూఎన్ పరిగణనలోకి తీసుకోబోదని స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 24న జెనీవాలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ సుస్థిర అభివృద్ధి అనే అంశంపై బహిరంగ చర్చా వేదిక నిర్వహించింది. యునైటెడ్ స్టేట్ ఆఫ్ కైలాస ప్రతినిధుల పేరుతో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. వారిలో విజయప్రియ నిత్యానంద అనే మహిళ తనని తాను పరిచయం చేసుకుంటూ కైలాస దేశ రాయబారిగా పేర్కొన్నారు.తన ప్రసంగంలో విజయప్రియ నిత్యానంద మాట్లాడుతూ.. కైలాసం దేశం సుస్థిర అభివృద్ధి కోసం పురాతన హిందూ విధానాలు, సమయ పరీక్షించిన హిందూ సూత్రాలకు అనుగుణంగా ఉన్న స్వదేశీ పరిష్కారాలను అమలు చేస్తోంది" అని పేర్కొన్నారు. నిత్యానంద స్థాపించిన కైలాస దేశం హిందువుల కోసం స్థాపించిన మొట్టమొదటి సార్వభౌమ రాజ్యమని అన్నారు.
దీంతో ఐక్యరాజ్య సమితి కైలాస దేశాన్ని అధికారికంగా గుర్తించిందా? అన్న సందేహం అందరిలోనూ వ్యక్తమైంది. దీనిపై తాజాగా ఐరాస స్పందించి వివరణ ఇచ్చింది. సమావేశాల్లో ఎవరైనా మాట్లాడొచ్చని, అంతమాత్రాన స్వయం ప్రకటిత సంస్థల ప్రతినిధులు అందించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది.