North Korea: నార్త్ కొరియా ప్రభుత్వం సంచలన ఆదేశాలు, 11 రోజులు పాటు నవ్వడం, తాగడం, షాపింగ్ చేయడంపై నిషేధం, తండ్రి కిమ్ జోంగ్ ఇల్ వర్ధంతి సందర్భంగా ప్రజలంతా విషాదంలోనే గడపాలని కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు
1994 నుండి డిసెంబర్ 17, 2011 వరకు దేశాన్ని పాలించిన అతని తండ్రి, మాజీ పాలకుడు కిమ్ జోంగ్ ఇల్ 10వ వర్ధంతి (Kim Jong-il death anniversary) సందర్భంగా డిసెంబర్ 17 నుండి 11 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయి.
ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ వర్దంతి వేడుకల్ని శుక్రవారం(డిసెంబర్ 11) నుంచి 11 రోజులపాటు దేశవ్యాప్తంగా (North Korea) నిర్వహించాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరుణంలో వర్ధంతి వేడుకల సందర్భంగా ఉత్తర కొరియాలో కఠిన ఆంక్షలు విధించారు.
ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ వర్ధంతి సందర్భంగా 11 రోజుల పాటు నవ్వడం, తాగడం, షాపింగ్ చేయడంపై నిషేధం విధించారు. 1994 నుండి డిసెంబర్ 17, 2011 వరకు దేశాన్ని పాలించిన అతని తండ్రి, మాజీ పాలకుడు కిమ్ జోంగ్ ఇల్ 10వ వర్ధంతి (Kim Jong-il death anniversary) సందర్భంగా డిసెంబర్ 17 నుండి 11 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయి.
1994 నుంచి 2011(చనిపోయేవరకు) ఉత్తర కొరియాను పాలించిన నియంతాధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఇల్ (Kim Jong-il) చిన్న కొడుకే.. ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. సినుయిజు సిటీలోని Radio Free Asia (RFA) అందించిన కథనం ప్రకారం.. ఈ పదకొండు రోజులు ఏ పౌరుడు సంతోషంగా ఉండడానికి వీల్లేదు. మద్యం కూడా తాగ కూడదు (bans laughing, drinking, shopping). ఎవరూ పుట్టినరోజులు జరుపుకోకూడదు. బహిరంగంగా నవ్వడానికి, ఏడవడానికీ వీల్లేదు. ఎటువంటి వేడుకలు చేసుకోవడానికి, వాటిల్లో పాల్గొనకూడదు. చివరికి ఇంట్లో ఎవరైనా చనిపోయినా కన్నీళ్లు పెట్టుకోకూడదు.
Here's UPdate
వర్ధంతి రోజైన శుక్రవారం.. నిత్యావసరాల దుకాణాల ముందు జనాలెవరూ క్యూ కట్టడానికి వీల్లేదు. విషాద దినాల్లో మాజీ అధ్యక్షుడి నివాళి సమావేశానికి అందరూ హాజరవ్వాలి. వీటిని ఎవరు ఉల్లంఘించినా (కిమ్ కుటుంబం, పేషీ తప్ప) వాళ్లు నేరగాళ్ల కిందే లెక్క. శిక్షగా మరణశిక్ష లేదంటే జీవితకాలం బానిస బతుకు ఏదో ఒకటి డిసైడ్ చేస్తారు.
కాగా ఈ పదేళ్లలో ఇలాంటి ఉత్తర్వులు జారీ కావడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. ఈ ఆదేశాల్ని జనాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదే. ఇందుకోసం వాళ్లను నిద్ర కూడా పోకూడదని కిమ్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసిందని తన కథనంలో తెలిపింది. సామూహిక సంతాప మూడ్‌ను దెబ్బతీసే వారిపై కఠినంగా వ్యవహరించడానికి పోలీసులు నెల రోజుల పాటు స్పెషల్ డ్యూటీ వేశారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది మొదట్లో కిమ్ కార్యాలయం.. జనాలను టైట్ జీన్స్ వేయకూడదని, స్టయిల్‌గా రెడీ కాకూడదని ఆదేశాలు జారీ చేసింది. క్యాపిటలిస్టిక్ లైఫ్‌స్టయిల్ కొరియా యువత మీద ప్రతికూల ప్రభావం చూపెడుతోందన్న ఉద్దేశంతో పాప్ కల్చర్‌ను ఉన్ బ్యాన్ చేశాడు. అలాగే తన స్టయిల్‌ను కాపీ కొట్టకూడదనే ఉద్దేశంతో ఆ తరహా లెదర్ జాకెట్లను నిషేధించాడు. ఇక స్క్విడ్ గేమ్ దక్షిణ కొరియా సిరీస్ కావడంతో.. దానిని సర్క్యులేట్ చేసిన ఓ వ్యక్తిని కాల్చి చంపడంతో పాటు ఓ స్కూల్ ప్రిన్స్‌పాల్, టీచర్, ఐదుగురు పిల్లలకు బానిస శిక్షను అమలు చేశాడు.