File image of North Korea Dictator Kim Jong-un | Image Courtesy: Facebook

Seoul, August 23: గత కొంత కాలంగా ఉత్తర ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ ఆరోగ్యంపై మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. తాజాగా దక్షిణ కొరియా అధికారి, గతంలో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే-జంగ్‌కు సహాయకుడిగా పని చేసిన చాంగ్‌ సాంగ్‌ మిన్‌ కిమ్ ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ కోమాలోకి వెళ్లారని (Kim Jong Un in Coma), తమ దేశానికి చెందిన గూఢచర్య వర్గాలు వెల్లడించాయని ఆయన అన్నారు.

చాంగ్‌ సాంగ్‌ మిన్‌ మాట్లాడుతూ..‘కిమ్ కోమాలో (North Korean Leader Is In Coma) ఉన్నట్టు నేను అంచనా వేస్తున్నాను. కానీ అతను మరణించలేదు’ అని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది కిమ్ బయట కనిపించింది చాలా తక్కువని.. ఆయన ఆరోగ్యం క్షిణించిందని చాంగ్ తెలిపారు. ప్రస్తుతం ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందకు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ (Kim Yo-jong) సిద్దంగా ఉన్నారని చాంగ్ అన్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడికి ఉన్న కొన్ని అధికారాలను.. విదేశీ వ్యవహారాలతో పాటుగా ఆర్థిక, సైనిక రంగంలోనూ జోంగ్‌కు కొన్ని అధికారాలను కట్టబెట్టినట్టుగా దక్షిణ కొరియా మీడియా పేర్కొన్న విషయం విదితమే. కిమ్ బతికే ఉన్నాడని వార్తలు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ, ఆయన ఆరోగ్య వదంతులను కొట్టివేసిన అమెరికా, దక్షిణ కొరియా దేశాలు

గతంలో కూడా కిమ్‌ ఆరోగ్యంపై ఎన్నో పుకార్లు చక్కర్లు కొట్టాయి. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించిందని, ప్రాణాలతో పోరాడుతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఆయనకు బ్రెయిన్‌ డెడ్‌ అయిందని పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో పక్క దేశానికి చెందిన అధికారి కిమ్లో ఉన్నాడని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది.