Kim Jong Un: తన గురించి గూగుల్‌లో వెతికినందుకు గూఢాచారికి ఉరిశిక్ష, ఉత్తరకొరియాలో సొంత అధికారినే చంపించిన కిమ్ జోంగ్ ఉన్

ఇంకేముంది? ఇది దేశద్రోహం కింద జమకట్టింది కిమ్ ప్రభుత్వం. ఈ ఏజెంట్లలో ఓ వ్యక్తికి మరణశిక్ష విధించింది కిమ్ ప్రభుత్వం. ఇక మిగిలినవారిని ఆయా పదవుల నుంచి తీసివేసింది.

Kim Jong Un (PIC@ Wikimedia Commons)

Pyongyang, March 15: నార్త్ కొరియా నియంత..నరకాసురుడు ఇలా కిమ్ (Kim Jong Un) గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. కిమ్ కుటుంబం నియంత పాలనతో దేశంలో ప్రజలు బానిసల్లా బతుకుతున్నారు. తనదేశ ప్రజలు ఏం తినాలో..ఎటువంటి దుస్తులు ధరించాలో..ఏం చూడాలో.. ఏం చూడకూడదో..ఎటువంటి పేర్లు పెట్టుకోవాలో ఆఖరికి ఎటువంటి హెయిర్ స్టైల్ తో ఉండాలో కూడా శాసిస్తాడీ నియంత. దేశం సంక్షోభంలో కొట్టుకుపోతున్నా కిమ్ కుటుంబం మాత్రం విలాసాలతోనే జీవిస్తారు. దేశంలో ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్నా..ప్రజలు ఆకలిలతో అలమటించిపోతున్నా..వరుస క్షిపణి ప్రయోగాలు కొనసాగిస్తే హడలెత్తిస్తున్నాడు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. కిమ్ జోంగ్-ఉన్ గురించి గూగుల్‌లో చదివినందుకు (Googling) ఉత్తర కొరియా సీక్రెట్ ఏజెన్సీకి చెందిన అధికారిని ఆ దేశ సైన్యం ఉరితీసింది. కిమ్ గురించి తెలుసుకోవటానికి గూగుల్ లో చదవిన ఓ గూఢాచారి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

Cyclone Freddy: మలావిని అతలాకుతలం చేసిన ఫ్రెడ్డీ తుపాను.. నెల రోజుల వ్యవధిలో రెండోసారి విరుచుకుపడిన తుపాను.. 100 మందికిపైగా మృత్యువాత.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం 

ప్రభుత్వానికి చెందిన టాప్ సీక్రెట్ బ్యూరో 10కి చెందిన పలువురు ఏజెంట్లు సెన్సార్ చేయని ఇంటర్నెట్ కంటెంట్ ను అక్రమంగా యాక్సెస్ చేస్తూ పట్టుబడడ్డారు. ఇంకేముంది? ఇది దేశద్రోహం కింద జమకట్టింది కిమ్ ప్రభుత్వం. ఈ ఏజెంట్లలో ఓ వ్యక్తికి మరణశిక్ష విధించింది కిమ్ ప్రభుత్వం. ఇక మిగిలినవారిని ఆయా పదవుల నుంచి తీసివేసింది. తోటి ఏజెంట్ ద్వారా స్టేట్ పెక్యూరిటీ మంత్రిత్వశాఖకు పంపబడిన అనేకమంది గూఢాచార ఏజెంట్లలోని ఓ ఏజెంట్ కు మరణశిక్ష (executes) విధించబడింది.‘సన్యాసి రాజ్యం’ అని పిలవబడే ఉత్తరకొరియాలో అత్యున్నత స్థాయి ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఇంటర్నెట్ ను యాక్సెస్ చేయలేరు. బ్యూరో 10 అధికారి అధ్యక్షుడు కిమ్ గురించి గూగుల్ లో శోధించిన వెంటనే వారి ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

UK: జైల్లోనే సెక్స్ దుకాణం పెట్టేశారు, రోజూ రాత్రిపూట ఖైదీలతో శృంగారంలో పాల్గొన్న 18 మంది మహిళా గార్డులు, వారిని విధుల నుంచి సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు 

ఉత్తర కొరియాలోని మానవ హక్కుల కమిటీ డైరెక్టర్ గ్రెగ్ స్కార్లాటోయు మాట్లాడుతూ..ఇంటర్నెట్ యుగంలో బయటి సమాచారాన్ని నిరోధించడానికి పోరాడుతున్న దేశంపై పట్టు నెమ్మదిగా సడలుతోందనడానికి ఇది ఒక ఉదాహరణ అని అన్నారు. కిమ్‌ పాలనలో అత్యంత విశ్వసనీయ ఏజెంట్లు కూడా ఇప్పుడు బయటి ప్రపంచం నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బలవంతం, శిక్ష, నిఘా, సమాచార నియంత్రణ ద్వారా కిమ్‌ కుటుంబం అధికారంలో కొనసాగుతోందని..బయటి ప్రపంచం నుంచి దేశంలోకి ప్రవేశించే సమాచారం పాలనకు ముప్పుగా భావిస్తున్నారని అన్నారు. కానీ ఎంతటి నియంతకు అయినా పతనం తప్పదని..ఇలా ప్రజలను అంతులేని ఆంక్షల చట్రంలో నిర్భంధిస్తు నియంత్ర కిమ్ కు ఏదోక రోజు వారి కుటుంబ పాలన అంతం అవ్వక తప్పదన్నారు. కానీ ఇది అంత సులువు కాదని తెలిసిందే.