Newdelhi, March 10: ఆఫ్రికా దేశం మలావిని (Malawi) తుపానులు (Cyclone) కుదేలు చేస్తున్నాయి. ఫ్రెడ్డీ (Freddy) తుపానుతో మలావి అతలాకుతలం అవుతోంది. నెల రోజుల వ్యవధిలోనే తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉద్ధృతికి వందలాది మంది ప్రజలు కొట్టుకుపోతున్నారు. భవనాలు కుప్పకూలుతున్నాయి. ఇప్పటి వరకు 100 మందికిపైగా మృత్యువాత పడ్డారు. వారిలో 60 మంది మృతదేహాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నట్టు పేర్కొన్నారు. మృతుల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
Return of Cyclone Freddy kills more than 100 in Malawi and Mozambique - #mozambique #more_than #lilongwe #cyclone #africa #malawi #maputo #than https://t.co/oQWXlCcWK0
— IdeallyaNews (@IdeallyaNews) March 14, 2023
‘తుపాను ధాటికి ఎటు చూసినా నదులు పొంగిపొర్లుతున్నాయి. నీటి ప్రవాహంలో ప్రజలు కొట్టుకుపోతున్నారు. తుపాను వల్ల దక్షిణ, మధ్య ఆఫ్రికాలోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ ఎక్కువగా మట్టి నివాసాలే ఉన్నాయి. అవి ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు’ అని స్థానిక పోలీసు ఒకరు తెలిపారు.