North Korea: ద‌క్షిణ కొరియా విష‌యంలో కిమ్ సంచ‌ల‌న నిర్ణ‌యం, స‌రిహ‌ద్దును శాశ్వ‌తంగా మూసేస్తూ ప్ర‌క‌ట‌న‌

ఇప్పటికే రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా కీలక ప్రకటన చేసింది. దక్షిణ కొరియాతో సరిహద్దును శాశ్వతంగా మూసేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలను వెలువరించింది.

File image of North Korea Dictator Kim Jong-un | Image Courtesy: Facebook

Pyongyang, OCT 09: ఉత్తర కొరియా (North Korea) – దక్షిణ కొరియా (South Korea) దేశాల మధ్య దూరం మరింత పెరగనుంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా కీలక ప్రకటన చేసింది. దక్షిణ కొరియాతో సరిహద్దును శాశ్వతంగా మూసేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలను వెలువరించింది. దక్షిణ కొరియాతో తమకున్న సియోల్‌ సరిహద్దును పూర్తిగా మూసివేసేందుకు నిర్ణయించామని, ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ఉత్తర కొరియా సైన్యం వెల్లడించింది. అకస్మాత్తుగా సంఘర్షణ తలెత్తకుండా యూఎస్‌ మిలిటరీకి ముందే సమాచారం ఇచ్చామని పేర్కొంది. రెండు కొరియాల మధ్య ఉన్న రోడ్లు, రైల్వే మార్గాలను మూసేస్తున్నట్లు ప్యోగ్యాంగ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ చర్యను ‘ప్రధాన సైనిక చర్య’గా నార్త్‌ కొరియా అభివర్ణిస్తోంది.

Terror Attack at Karachi Airport: కరాచీ ఎయిర్ పోర్ట్ వద్ద భారీ పేలుడు.. చైనీయులే లక్ష్యంగా దాడి.. ముగ్గురు మృతి 

1991లో ఉత్తర-దక్షిణకొరియా దేశాల మధ్య జరిగిన ఓ కీలక ఒప్పందాన్ని కిమ్‌ (Kim Jong Un) రాజ్యం రద్దు చేసుకోవాలని భావిస్తోంది. అంతేకాక దక్షిణ కొరియాను తమ శత్రు దేశంగా ప్రకటించాలని నిర్ణయించింది. పార్లమెంటరీ సమావేశాల్లో ఈ విషయాలన్నీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ, సమావేశాలు మంగళవారంతో ముగిసినప్పటికీ దీనిపై ఎలాంటి సమాచారం లేదు. ఉత్తర కొరియా ఎలాంటి నిర్ణయం తీసుకుందనే విషయంపై స్పష్టత లేదు.

World's Largest Residential Building: ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనం.. 20 వేల మందికి పైగా ఆవాసం.. చైనాలో భవంతి.. వీడియో ఇదిగో..! 

ఈ క్రమంలోనే దక్షిణ కొరియాతో సరిహద్దును పూర్తిగా మూసేసేందుకు ఉత్తరకొరియా సన్నాహాలు చేస్తోందని ఆ దేశ సైన్యం తాజాగా వెల్లడించింది. రోడ్డు, రైలు మార్గాలను నిలిపివేసి బలమైన రక్షణ నిర్మాణాలతో తమ ప్రాంతాలను మరింత పటిష్టం చేసుకోనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో సరిహద్దును పటిష్టం చేసే పనిలో ఉన్న ఉత్తర కొరియా సైనికులు కొందరు పేలుళ్ల కారణంగా మరణించారు.

అదే నెలలో రెండు కొరియాలను కలిపే రైల్వే లైన్లలోని భాగాలను ఉత్తర కొరియా కూల్చివేస్తోందన్న సంకేతాలను గుర్తించినట్లు సియోల్‌ గూఢచారి సంస్థ తెలిపింది. తమ శత్రు దేశంతో ఉన్న సరిహద్దును పూర్తిగా మూసేసి.. రాకపోకలను నివారించేందుకు ఉత్తర కొరియా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తున్నది.



సంబంధిత వార్తలు

Realme 14X 5G: రియల్ మి నుంచి తొలిసారిగా ఐపీ69 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌ స్మార్ట్‌ఫోన్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో రియల్‌మీ 14ఎక్స్‌ 5జీ వచ్చేసింది, ధర, పీచర్లు ఇవిగో..

Ravichandran Ashwin Records: 11 సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు, రవిచంద్రన్ అశ్విన్ రికార్డులు ఇవిగో, హర్భజన్ సింగ్ ప్లేసు భర్తీ చేసి అద్భుతాలు సృష్టించిన లెజెండరీ ఆఫ్ స్పిన్నర్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

KTR Meets Nandini Sidda Reddy: రేవంత్ రెడ్డి ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించిన నందిని సిధారెడ్డి, ఇంటికి వెళ్లి మ‌రీ అభినందించిన కేటీఆర్