Kim Jong Un Health: మా అన్నకు జ్వరం వచ్చింది! దానికి కారణం దక్షిణ కొరియానే, కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై స్పందించిన అతని సోదరి, దక్షిణకొరియా కుట్రతో కిమ్‌కు కరోనా వచ్చిదంటూ ఆగ్రహం, కిమ్ ఎలా ఉన్నారో మాత్రం సోదరి
దీనికి దక్షిణ కొరియా (South korea) కారణమని ఆరోపించింది. కరోనా వైరస్‌ను కరపత్రాల ద్వారా ఉత్తర కొరియాలోకి వ్యాపిస్తున్నారంటూ మండిపడింది.
North Korea, AUG 12: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు అతడి సోదరి కిమ్ యో జోంగ్ తెలిపింది. దీనికి దక్షిణ కొరియా (South korea) కారణమని ఆరోపించింది. కరోనా వైరస్‌ను కరపత్రాల ద్వారా ఉత్తర కొరియాలోకి వ్యాపిస్తున్నారంటూ మండిపడింది. ఒక ప్రసంగంలో మాట్లాడిన ఆమె, తన సోదరుడు కిమ్ (Kim Jong Un) జ్వరం వల్ల తీవ్ర అనారోగ్యం బారిన పడిటనట్లు చెప్పింది. అయితే ప్రజల కోసం ఆయనకున్న ఆందోళన వల్ల ఒక్క క్షణమైనా బెడ్‌పై విశ్రాంతి తీసుకోలేదని తెలిపింది. అలాగే కిమ్ సోదరి యో జోంగ్ (Kim Jong Un Sister)మరోసారి దక్షిణ కొరియాకు వార్నింగ్ ఇచ్చింది. ‘వైరస్‌ను ప్రవేశపెట్టే కరపత్రాలను మా రిపబ్లిక్‌లోకి పంపే పనిని శత్రువులు మానుకోవాలి. ఇది కొనసాగిస్తే వైరస్‌ను మాత్రమే కాకుండా దక్షిణ కొరియా అధికారులను కూడా నిర్మూలించేలా మేం ప్రతిస్పందిస్తాం’ అని హెచ్చరించింది. అధికార కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఈ మేరకు గురువారం వెల్లడించింది. అయితే కిమ్ ఎప్పుడు అనారోగ్యానికి గురయ్యారు, ఆయన జ్వరానికి కారణం ఏమిటన్నది పేర్కొనలేదు.
మరోవైపు ఉత్తర కొరియాలో కరోనా వైరస్ (Corona virus) విజృంభిస్తున్నది. ఆ దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరం బారినపడుతున్నారు. అయితే కరోనాను పూర్తిగా నియంత్రించినట్లుగా కిమ్ ప్రకటించారు. కాగా, కరోనా టెస్టులు నిర్వహించని ఉత్తర కొరియా, కరోనాను జ్వర వ్యాధిగా వ్యవహరిస్తున్నది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించని రెండు దేశాల్లో ఉత్తర కొరియా ఉన్నది.
గత కొంత కాలంగా కిమ్ జోంగ్ ఆరోగ్య పరిస్థితుల గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అధిక బరువు, ధూమపానం వంటి కారణాలు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై కొన్నేళ్లుగా వదంతులు వ్యాప్తిచెందుతున్నాయి. కాగా కిమ్ కుటుంబానికి గుండె జబ్బుల చరిత్ర ఉంది. దీంతో, ప్రపంచవ్యాప్తంగా కిమ్ ఆరోగ్యంపై వార్తలు బయటకు వస్తుంటాయి.