Earthquake in Chile: చిలీని వణికించిన భారీభూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2 గా నమోదు, 10 కిలోమీటర్ల లోతులోనే భూకంపకేంద్రం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజల పరుగులు (వీడియో)

భారీ భూకంపంతో (Earthquake in Chile) చిగురుటాకులా వణికిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి రిక్టర్‌ స్కేల్‌పై 6.2 తీవ్రతతో శక్తివంతమైన ప్రకంపనలు చిలీని కుదిపేశాయి.

Earthquake Representative Image (Photo Credit: PTI)

Chile, SEP 07: దక్షిణ అమెరికా దేశం చిలీ తీర ప్రాంతం.. భారీ భూకంపంతో (Earthquake in Chile) చిగురుటాకులా వణికిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి రిక్టర్‌ స్కేల్‌పై 6.2 తీవ్రతతో శక్తివంతమైన ప్రకంపనలు చిలీని కుదిపేశాయి. అయితే శక్తివంతమైన ప్రకంపనల తర్వాత.. ఎలాంటి నష్టం వాటిల్లిందనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం రాత్రి ఉత్తర చిలీలో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని.. భూకంపం కేంద్రం కోక్వింబోలో నలబై కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమై ఉందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (U.S. Geological Survey) వెల్లడించింది.

అయితే.. జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జియోసైన్సెస్‌ మాత్రం.. 6.5 తీవ్రతతో మధ్య చిలీ రీజియన్‌లో భూకంపం సంభవించిందని.. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైంది ఒక ప్రకటన విడుదల చేసింది.

దక్షిణామెరికా దేశమైన చిలీ.. పసిఫిక్‌ ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ పరిధిలో ఉంది. అందుకే తరచూ ఇక్కడ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2010లో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 526 మంది మృతి చెందారు.

 

ప్రకంపనల ధాటికి ప్రజలు వణికిపోయారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి కూడా.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif