Gandhi Statue Vandalised: అమెరికాలో మ‌హాత్మా గాంధీ విగ్ర‌హం ధ్వంసం, క్షమాపణలు కోరిన అమెరికా, ఆర్మీని రంగంలోకి దింపుతామని తెలిపిన ట్రంప్

నల్లజాతీయుడి హత్యతో అగ్రరాజ్యంలో ఆందోళనలు (Ongoing Protests in US) మిన్నంటాయి. మిన్నియాపోలీస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్లజాతీయుడిని పోలీసులు హతమార్చడంతో.. అమెరికా అంతటా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సెగ ఇండియా మహత్ముడికి (Mahatma Gandhi) కూడా తగిలింది. అమెరికాలో ఆందోళ‌న‌కారులు మ‌హాత్మా గాంధీ విగ్ర‌హాన్ని ధ్వంసం (Gandhi Statue Vandalised) చేశారు. వాషింగ్ట‌న్ డీసీలోని ఇండియ‌న్ ఎంబ‌సీలో ఉన్న గాంధీ విగ్ర‌హాన్ని న‌ల్ల‌జాతీయులు ధ్వంసం చేసిన‌ట్లు తెలుస్తోంది. బ్లాక్ లైవ్స్ మ్యాట‌ర్ నిర‌స‌న‌కారులు ఈ విధ్వంసానికి పాల్ప‌డిన‌ట్లు ఓ వార్త సంస్థ పేర్కొన్న‌ది.

Mahatma Gandhi Statue Outside US Embassy (Photo Credits: ANI)

Washington, Jun 4: గత కొన్ని రోజులుగా అమెరికా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. నల్లజాతీయుడి హత్యతో అగ్రరాజ్యంలో ఆందోళనలు (Ongoing Protests in US) మిన్నంటాయి. మిన్నియాపోలీస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్లజాతీయుడిని పోలీసులు హతమార్చడంతో.. అమెరికా అంతటా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సెగ ఇండియా మహత్ముడికి (Mahatma Gandhi) కూడా తగిలింది. జార్జ్ ఫ్లాయిడ్‌ది నరహత్యే, పోస్టుమార్టం నివేదికలో బహిర్గతం, నిరసనలపై మండిపడిన డొనాల్డ్ ట్రంప్, హత్యను ఖండించిన టెక్ దిగ్గజాలు

అమెరికాలో ఆందోళ‌న‌కారులు మ‌హాత్మా గాంధీ విగ్ర‌హాన్ని ధ్వంసం (Gandhi Statue Vandalised) చేశారు. వాషింగ్ట‌న్ డీసీలోని ఇండియ‌న్ ఎంబ‌సీలో ఉన్న గాంధీ విగ్ర‌హాన్ని న‌ల్ల‌జాతీయులు ధ్వంసం చేసిన‌ట్లు తెలుస్తోంది. బ్లాక్ లైవ్స్ మ్యాట‌ర్ నిర‌స‌న‌కారులు ఈ విధ్వంసానికి పాల్ప‌డిన‌ట్లు ఓ వార్త సంస్థ పేర్కొన్న‌ది.

వాషింగ్ట‌న్ డీసీలో గాంధీ విగ్ర‌హం ధ్వంస‌మైన ఘ‌ట‌న ప‌ట్ల అమెరికా (America) క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. త‌మ క్ష‌మాప‌ణ‌ల‌ను అంగీక‌రించాలంటూ అమెరికా అంబాసిడ‌ర్ కెన్ జ‌స్ట‌ర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. న‌ల్ల‌జాతీయు జార్జ్ ఫ్లాయిడ్ మృతి ప‌ట్ల దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నాని, గాంధీ విగ్ర‌హ ధ్వంసాన్ని కూడా ఖండిస్తున్న‌ట్లు కెన్ జ‌స్ట‌ర్ పేర్కొన్నారు. ఎటువంటి వివ‌క్ష‌నైనా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. కాగా ఇండియన్ ఎంబస్సీ దీనిపై అక్కడ ఫిర్యాదు చేసింది.

Here's Tweet

కాగా గాంధీ విగ్రహం ధ్వంసం ఘటనపై వాషింగ్టన్ పార్క్ పోలీసులు విచారణ మొదలుపెట్టారు. వాషింగ్టన్‌లోని భారతీయ దౌత్యకార్యాలయంలో.. గాంధీ విగ్రహం ధ్వంసం కావడం కూడా ఆందోళనకారులు పనే అని తేలింది. అయితే ఆందోళనకారులు హింసాత్మక బాట పట్టడంతో.. వారిని ట్రంప్ హెచ్చరించారు. ప్రదర్శనలను శాంతియుతంగా చేయకుంటే.. ఆర్మీని రంగంలోకి దింపాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

గతవారం అమెరికాలో జార్జ్ ఫ్లాడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్‌ని మినియా పొలీస్ నగర పోలీసు ఒకడు మెడపై కాలితో బలంగా నొక్కడంతో జార్జ్ మరణించాడు. ఈ దారుణానికి నిరసనగా గత నెల 25 నుంచే దేశవ్యాప్తంగా అల్లర్లు, ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా ఆ నిరసనల సెగ వైట్ హౌస్‌ని కూడా తాకింది. భారీ సంఖ్యలో ఆందోళనకారులు వైట్ హౌస్ వద్ద గుమికూడి నిరసనలకు దిగారు.



సంబంధిత వార్తలు

Navya Haridas File Petition In Kerala HC: ప్రియాంక గాంధీ ఎంపీగా అన‌ర్హురాలు, త‌ప్పుడు మార్గంలో గెలిచారు, హైకోర్టులో పిటీష‌న్ వేసిన బీజేపీ అభ్య‌ర్ధి

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif