Malaysia Train Accident: ఘోర రైలు ప్రమాదం, ఎదురెదురుగా ఢీకొన్న మెట్రోరైళ్లు, 213 మందికి గాయాలు, వీరితో 33 మంది పరిస్థితి ఆందోళనకరం, 40 మందికి తీవ్ర గాయాలు, మలేషియా దేశంలో కౌలాలంపూర్ నగరం విషాద ఘటన

నగరంలో సొరంగంలో రెండు మెట్రోరైళ్లు ఢీకొన్న ప్రమాదంలో (Light Rail Trains Collide) 213 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన 23 ఏళ్ల మలేషియా (Malaysia) మెట్రోరైలు చరిత్రలో మొదటిది. తీవ్రంగా గాయపడిన 47 మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు.

Two Light Rail Trains Collide (Photo Credits: Twitter)

Kuala Lumpur, May 25: మలేషియా దేశంలోని కౌలాలంపూర్ నగరంలో ఘోర ప్రమాదం (Malaysia Train Accident) చోటు చేసుకుంది. నగరంలో సొరంగంలో రెండు మెట్రోరైళ్లు ఢీకొన్న ప్రమాదంలో (Light Rail Trains Collide) 213 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన 23 ఏళ్ల మలేషియా (Malaysia) మెట్రోరైలు చరిత్రలో మొదటిది. తీవ్రంగా గాయపడిన 47 మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు.

క్షతగాత్రులకు గాజు ముక్కలు తగిలి రక్తం స్రవించింది. ప్రపంచంలోని ఎత్తైన జంట టవర్లలో ఒకటైన పెట్రోనాస్ టవర్స్ సమీపంలోని సొరంగంలో రెండు రైళ్లు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని మలేషియా రవాణ శాఖ మంత్రి వీ కాసియాంగ్ చెప్పారు. మెట్రోరైలు ప్రమాద ఘటనపై మలేషియా ప్రధాన మంత్రి మొహిద్దీన్ యాసీన్ దర్యాప్తునకు ఆదేశించారు. రైళ్ల ఆపరేషన్ కంట్రోల్ సెంటరులో తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘోర ప్రమాదం..పై నుంచి తెగిపడిన కేబుల్‌ కారు, 13 మంది దుర్మరణం, ఇటలీలోని మాగియోర్‌ సరస్సు అందాల వీక్షణలో విషాదం, విషమంగా మరికొందరి పరిస్థితి

మంగళవారం ఉదయం మెట్రోరైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. రైలు ప్రమాదం జరిగినపుడు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ఎగిరి కింద పడ్డారు. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో 33 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా 160 మందికి స్వల్ప గాయాలయ్యాయి.