Man Lights Firework on his Head: ఫుల్లుగా తాగి తలపై బాంబు పేల్చుకున్నాడు, పుర్రెను చీల్చేసిన టపాసులు, అమెరికాలోని టెక్సాస్ లో ఘటన
బాగా తాగిన తర్వాత సరదాగా ఫ్రెండ్స్ తో ఆడుకున్నాడు. ఈ క్రమంలోనే తన తలపై బాణాసంచా కాల్చుకున్నాడు. దీంతో తలపై పేలిన బాణాసంచా అతని పుర్రెను చీల్చుకుంటూ లోపలకు వెళ్లాయని అధికారులు భావిస్తున్నారు.
Texas, July 10: పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి అంటారు. సరదా కోసం ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తుంటారు. ఒకరు డ్యాన్స్ చేస్తే, మరొకరు తాగుతారు. ఇక సెలబ్రేషన్స్ లో బాణాసంచా(Fire works) పేల్చేవారు కొందరు. అయితే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కూడా అలాగే చేశాడు. కానీ బాగా తాగిన వ్యక్తి...సంతోషంలో టపాసులు పేల్చాడు. కానీ అతను టపాసులు (Fire works) పేల్చింది రూమ్‌లో కాదు. ఏకంగా తన తలమీద టపాసులు పేల్చుకున్నాడు. దాంతో అవి ఏకంగా అతని తలను చీల్చాయి. తల పగిలిపోయి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో (Texas) వెలుగు చూసింది. పాబ్లో రూయిజ్ అనే 43 ఏళ్ల వ్యక్తి స్నేహితులతో పార్టీ (Party)చేసుకున్నాడు. బాగా తాగిన తర్వాత సరదాగా ఫ్రెండ్స్ తో ఆడుకున్నాడు. ఈ క్రమంలోనే తన తలపై బాణాసంచా కాల్చుకున్నాడు. దీంతో తలపై పేలిన బాణాసంచా అతని పుర్రెను చీల్చుకుంటూ లోపలకు వెళ్లాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాబ్లో మరణించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదకర ఫీట్ చేసే సమయంలో పాబ్లో ఫుల్లుగా మందుకొట్టి ఉన్నాడని, ఆ మత్తులోనే ఈ చర్యకు పాల్పడ్డాడని అతని స్నేహితుడు వెల్లడించాడు.
ఈ ఘటనతో బాధితుడి కుటంబం దిగ్భ్రాంతికి గురయ్యారు. పాబ్లో రూయిజ్ తరచూ పార్టీలు చేసుకుంటుండే వాడని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఇంత ప్రమాదకరంగా ఎన్నడూ ప్రవర్తించలేదంటున్నారు.