Masoud Pezeshkian: ఇరాన్ అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్ గెలుపు.. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించి విజయతీరాలకు..

ఇరాన్‌ లో శుక్రవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ లో సంస్కరణవాది మసౌద్ పెజెష్కియాన్ గెలిచారు.

Masoud Pezeshkian (Credits: X)

Newdelhi, July 6: ఇరాన్‌ (Iran) లో శుక్రవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ (Iran presidential election polling) లో సంస్కరణవాది మసౌద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) గెలిచారు. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన ఆయన ఇరాన్ తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇరాన్‌ అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ఈ ఏడాది మే నెల 19న హెలిక్యాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు అక్కడ ఎన్నికలు నిర్వహించారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేడే.. ప్రజాభవన్ వేదికగా సమావేశంకానున్న చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరురాష్ట్రాల ప్రజలు.. ఏయే అంశాలపై చర్చ ఉండొచ్చంటే?

అప్పుడు కుదరలే..

ఇప్పటికే జూన్‌ మూడో వారంలో ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ 50 శాతం ఓట్లు రాకపోవడంతో మరోసారి పోలింగ్‌ నిర్వహించారు. ఇరాన్‌ రాజ్యాంగం ప్రకారం.. మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు సాధించిన అభ్యర్థినే అధ్యక్షుడిగా నియమిస్తారు.

స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌, అల్యూమినియం వంట పాత్రలకు ఐఎస్‌ఐ గుర్తు తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు



సంబంధిత వార్తలు