Naegleria Fowleri in Pakistan: పాకిస్తాన్‌‌లో కొత్త వ్యాధి కలకలం, మెదడును తినే అమీబా బారీన పడి 11 మంది మృతి, ముక్కు ద్వారా శరీరం లోపలకి వెళుతున్న నేగ్లేరియా ఫౌలెరి

దాయాది దేశం పాకిస్తాన్ ను కొత్త వ్యాధి వణికిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మెదడును తినే అమీబాతో 11 మంది మరణించారు. మెదడును తినే అమీబా కు కారణమయ్యే నేగ్లేరియా ఫౌలెరి అనే ఏక కణ జీవి పాకిస్తాన్ లో వ్యాపిస్తోంది.

Representational image (Photo Credit- Pixabay)

karachi, Nov 6: దాయాది దేశం పాకిస్తాన్ ను కొత్త వ్యాధి వణికిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మెదడును తినే అమీబాతో 11 మంది మరణించారు. మెదడును తినే అమీబా కు కారణమయ్యే నేగ్లేరియా ఫౌలెరి అనే ఏక కణ జీవి పాకిస్తాన్ లో వ్యాపిస్తోంది. కరాచీలోని సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌లో గత రెండు వారాల్లో ఈ అమీబా కారణంగా ముగ్గురు మరణించారు.దీంతో మొత్తం మరణాల సంఖ్య 11కు చేరింది.

తాజాగా మెదడును తినే అమీబా ‘నేగ్లేరియా ఫౌలెరి’ కరాచీలో మరొకరిని బలిగొందని సింధ్ ఆరోగ్య శాఖ తెలియజేసింది. హెల్త్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం మెట్రోపాలిస్‌లోని కరాచీ బఫర్ జోన్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తి నైగ్లేరియా కారణంగా మృతి చెందాడు. దీనిగురించి సింధ్ ఆరోగ్య శాఖ ప్రతినిధి మాట్లాడుతూ బాధితుడు గత మూడు రోజులుగా జ్వరం, తలనొప్పితో బాధపడ్డాడు.

ప్రపంచ దేశాలకు అమెరికా షాక్, హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కంటే 24 రెట్ల శక్తిమంతమైన అణుబాంబు తయారు చేస్తున్నట్లు ప్రకటన

పాకిస్తాన్‌లో ఇప్పటివరకు 11 మంది ‘నేగ్లేరియా ఫౌలెరి’ ఇన్‌ఫెక్షన్ (ఎన్‌ఎఫ్‌ఐ) కారణంగా ప్రాణాలు కోల్పోయారు. సింధ్ తాత్కాలిక ఆరోగ్య మంత్రి డాక్టర్ సాద్ ఖలీద్ మాట్లాడుతూ ఈ వ్యాధి విషయంలో ప్రజలు అప్రమత్తం కావాలని సూచించారు. ఇది అరుదైన ప్రాణాంతక అమీబా అని, ఇది మంచినీటి వనరులలో వృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. సరిగ్గా క్లోరినేషన్ చేయని కొలనులలో ఈత కొట్టడం మానుకోవాలని ఖలీద్ నియాజ్ ప్రజలను కోరారు. నోట్లో నీరు వచ్చేలా చేసే చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ముక్కులోకి నీరు ప్రవేశించేందుకు అవకాశమిచ్చే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

బ్రెయిన్ ఈటింగ్ ‍అమీబా 1937లో అమెరికాలో తొలిసారిగా వెలుగుచూసింది. ఈ అమీబా కొలనులు, నదులు, కాలువలు, చెరువల్లో ఉంటుంది. ముక్కు, నోరు లేదు చెవి ద్వారా లోపలికి ప్రవేశించి మనిషి మెదడును తినేస్తుంది. ఫలితంగా మరణానికి కారణం అవుతుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు చాలా తక్కువని నిపుణుల చెప్పారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు అత్యంత అరుదుగా నమోదవుతాయి. 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా 381 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. అమెరికా, భారత్, చైనాలోనూ ఈ కేసులు నమోదయ్యాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement