American Flag (Photo Credits: Twitter)

అమెరికా ప్రపంచానికి షాకిచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం (World War II) సమయంలో జపాన్‌లోని హిరోషిమా నగరంపై ప్రయోగించిన శక్తిమంతమైన అణుబాంబు కంటే మరింత బలమైన అణుబాంబును (Nuclear Bomb) తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. హిరోషిమాపై ప్రయోగించిన బాంబుతో పోలిస్తే 24 రెట్లు శక్తిమంతమైన అణుబాంబును తయారు చేసే యోచనలో ఉన్నట్లు పెంటగాన్‌ (Pentagon) ప్రకటించింది.

బీ61 కొత్త వేరియంట్‌ న్యూక్లియర్‌ గ్రావిటీ బాంబును తయారు చేయనున్నట్లు అమెరికా రక్షణశాఖ వెల్లడించింది. బీ61-13 పేరుతో దీన్ని రూపొందించనుంది. నేషనల్‌ న్యూక్లియర్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ (NNSA) సహకారంతో ఈ అణ్వాయుధాన్ని తయారు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆమోదం, కేటాయింపు అంశం చట్టసభ ముందు పెండింగులో ఉన్నట్లు సమాచారం.

శవాల దిబ్బగా మారిన గాజా, 50 మంది బందీలతో పాటు 7,028 మంది మృతి, అయినా గాజాపై భూతల దాడికి దళాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇజ్రాయెల్

అమెరికా తయారు చేయనున్న ఈ బీ61-13 అణుబాంబు 360 కిలోటన్నుల శక్తిని ఉత్పత్తి చేయనున్నట్లు అంచనా. అంటే హిరోషిమాపై ప్రయోగించిన దానికంటే 24 రెట్లు ఎక్కువ.జపాన్‌లోని హిరోషిమాపై (1945 ఆగస్టులో) ప్రయోగించిన బాంబు సుమారు 15 కిలో టన్నుల శక్తిని విడుదల చేయగా.. నాగసాకిపై విడిచిన బాంబు సామర్థ్యం 25 కిలోటన్నులు విడుదల చేసింది.