IPL Auction 2025 Live

PM Modi Speaks to Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ. కొంతమంది రాజకీయ నాయకులు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలు శాంతిపూర్వకమైన వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్య.

భారత్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మంది నాయకులు భారత్‌కు వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, అది శాంతిపూర్వకమైన వాతావరణాన్ని దెబ్బతీస్తుందని పాకిస్థాన్ ప్రధానిపై పరోక్షంగా ట్రంప్‌తో మోదీ వ్యాఖ్యానించారు...

Narendra Modi and Donald Trump File Photo. (Photo Credits: Twitter)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం 30 నిమిషాల పాటు టెలిఫోన్ లో సంభాషణ చేశారు. ఈ సంభాషణలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక మరియు ప్రాంతీయ అంశాలపై చర్చ జరిగింది మరియు ఇరువురు అగ్ర నాయకుల మధ్య స్నేహ సంబంధాలకు ఇది నిదర్శనం అని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

జూన్‌ నెలలో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఒసాకాలో ట్రంప్‌తో జరిగిన సమావేశాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు.

ఒసాకాలో తమ చర్చలను ప్రస్తావిస్తూ, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మరోసారి చర్చించడానికి కేంద్ర వాణిజ్య మంత్రి మరియు అమెరికా వాణిజ్య ప్రతినిధి త్వరలోనే సమావేశమవుతారని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మంది నాయకులు భారత్‌కు వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, అది శాంతిపూర్వకమైన వాతావరణాన్ని దెబ్బతీస్తుందని పాకిస్థాన్ ప్రధానిపై పరోక్షంగా ట్రంప్‌తో మోదీ వ్యాఖ్యానించారు.

ఉగ్రవాద నిర్మూలన మరియు సరిహద్దు ప్రాంతాలలో ఉగ్రవాద రహిత వాతావరణం ప్రాముఖ్యతను మోదీ ఎత్తిచూపారు. ఉగ్రవాద నిర్మూలనకు కలిసివచ్చే వారితో తాము జతకూడతామని. పేదరికం మరియు నిరక్షస్యరాస్యతపై పోరాటానికి పూర్తి నిబద్ధతతో పనిచేస్తామని తమ సంభాషణలో ట్రంప్‌కు మోదీ స్పష్టం చేశారు.



సంబంధిత వార్తలు