Nepal Plane Crash. (Photo Credits: ANI)

Kathmandu, May 30: నేపాల్‌లో జ‌రిగిన విమాన ప్ర‌మాదంలో (Nepal Plane Crash) ప్ర‌యాణికులంద‌రూ చ‌నిపోయిన‌ట్లు ఇవాళ అధికారులు వెల్ల‌డించారు. ఇప్పటివరకు 14 మంది మృతదేహాలను వెలికి తీశామని, మిగతావారి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 9 ఎన్‌-ఏఈటీ ట్విన్‌ విమానం ఆదివారం ఉదయం 9.55 గంటల సమయంలో ముస్తాంగ్‌లో గల్లంతైన విషయం తెలిసిందే. విమానం ఆచూకీని సోమవారం ఉదయం సైన్యం గుర్తించింది. ప్రతికూల వాతావరణం ఉండటంతో సన్సోవార్‌లో ఉన్న కొండల అంచులను ఢీకొట్టిన విమానం 14,500 అడుగుల లోతులో పడిపోయింది. దీంతో విమానం ఆచూకీని గుర్తించడానికి అధికారులకు ఆసల్యమయింది. ప్రమాద సమయంలో విమానంలో 22 మంది ఉన్నారు. వారిలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం, నలుగురు భారతీయులు సహా 22 మంది గల్లంతు, విమానం శిథిలాలు గుర్తింపు, దట్టమైన మంచుకురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం

కాగా, సోమవారం ఉదయం గాలింపు, సహాయక చర్యలు ప్రారంభించిన సైన్యం సన్సోవార్‌ సమీపంలో శకలాలను ( Tara Air Plane Crash Site) గుర్తించారు. విమానం ఎత్తునుంచి కిందపడిపోవడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడియాయని, విమాన శకలాలుకు వంద మీటర్ల దూరం వరకు పడిపోయాయని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 14 మృతదేహాలను (Collection of Dead Bodies Begins) వెలికితీశాని, వారిలో ఐదు మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్నాయని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఖట్మండులోని ఆస్పత్రికు తరలించామన్నారు. చిన్న హెలికాప్టర్ల సాయంతో ఘటనా స్థలానికి చేరుకున్నామని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.



సంబంధిత వార్తలు

Nepal Bans Sale of Everest, MDH Spices: ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై నిషేధం విధించిన నేపాల్.. కారణమేంటంటే..?

Sandeep Lamichhan Case: 18 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో క్రికెట‌ర్ కు ఊర‌ట‌, త‌న త‌ప్పు లేద‌ని తేల్చిన హైకోర్టు, వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు గుడ్ న్యూస్

IND Vs Nepal: అండ‌ర్ -19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెమీస్ కు చేరిన భార‌త్, సూప‌ర్ సిక్స్ లోనూ ఆగ‌ని టీమిండియా విజ‌యాల ప‌రంప‌ర‌

Vivah Panchami 2023 Date: డిసెంబర్ 17న వివాహ పంచమి పండగ, ఈ రోజు చేయాల్సిన పూజలు ఏంటో తెలుసుకుదాం.

Earthquake in Nepal: నేపాల్‌లో మరోసారి భూకంపం, అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో వణికిపోయిన ప్రజలు, ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు

UP Shocker: గ‌డ్డివాములో వేరొక‌రితో భార్య అలా ఉండటం చూసిన భ‌ర్త‌, నిప్పుపెట్టి స‌జీవద‌హ‌నం చేసిన వ్య‌క్తి, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో దారుణం

Nepal Earthquake Again: నేపాల్‌ లో ఆదివారం తెల్లవారుజామున మరోసారి భూకంపం.. తీవ్రత 3.6గా నమోదు.. అయోధ్యలోనూ కంపించిన భూమి.. శుక్రవారం భూకంప ఘటనలో 157కు చేరిన మరణాలు

Asian Games 2023: అంతర్జాతీయ టీ20ల్లో నేపాల్ కొత్త చరిత్ర, 20 ఓవర్లలో 314 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసిన పసికూన, విధ్వంసం మాములుగా లేదు మరి..