Nepal Plane Crash: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం, నలుగురు భారతీయులు సహా 22 మంది గల్లంతు, విమానం శిథిలాలు గుర్తింపు, దట్టమైన మంచుకురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం

Khatmandu, May 30: ఆదివారం ఉదయం నేపాల్ లో (Nepal) ఆదృశ్యమైన విమానం ఆచూకీ లభ్యమయ్యింది. తారా ఎయిర్ కు (Tara Air) చెందిన విమానం కొండల్లో కూలిపోయినట్లు గుర్తించారు. కొవాంగ్ సమీపంలో విమాన శకలాలను (Filght)అధికారులు గుర్తించారు. ఫోఖారా(Pokhara ) నుంచి నేపాల్ లోని జోమ్ సోమ్ కు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. విమానంలో సిబ్బందితో సహా 22 మంది ఉన్నారు. వీరిలో నలుగురు భారతీయులు, మిగిలిన వారంతా నేపాల్ కు (Nepal) చెందిన వారుగా అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం గం.9-55 నుంచి ఏటీసీ తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. తారా ఎయిర్ కు చెందిన 9 NAET ట్విన్‌ ఇంజిన్‌ విమానం టేకాఫ్ అయిన తర్వాత మొదట ముస్తాంగ్ జిల్లాలోని జామ్సన్ ప్రాంతంలో ఆకాశంలో గుర్తించామ‌ని, త‌ర్వాత‌ మౌంట్ ధౌలగిరి వైపు మళ్లింద‌ని….ఆ తర్వాత విమానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని నేపాల్ అధికారులు తెలిపారు.

విమానం ఆచూకీ కోసం రెండు ప్రైవేటు హెలికాప్టర్లతో పాటు నేపాల్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూడా గాలింపు చర్యల్లో పాల్గొన్నది. గాలింపు చర్యల్లో పాల్గోన్న నేపాల్ ఆర్మీకి స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. మనపతి హిమాల్ కొండచరియల కింద లాంచే నది ముఖద్వారం వద్ద విమానం కూలిపోయింది.

Singer Sidhu Moose Wala Shot Dead: పంజాబ్‌లో కాంగ్రెస్ నేతపై కాల్పులు, భద్రత ఉపసంహరించుకున్న మరుసటిరోజే ఘటన, 20 రౌండ్లకు పైగా కాల్పులు జరిపిన దుండగులు, స్పాట్‌లోనే కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా మృతి 

దీంతో నేపాల్ ఆర్మీ వాహనాలు, వాయు మార్గం ద్వారా ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలు దేరి వెళ్లారు. వాయు మార్గంలో వెళ్లిన వారికి విమానశకలాలు కనిపించినట్లు తెలిసింది. విమానం కూలిపోయిన చోట ఇప్పుడు మంచు కురుస్తున్నందున గాలింపు చర్యలు ఆపివేసినట్లు అధికారులు తెలిపారు.