Peshawar Blast: పాకిస్తాన్ పెషావర్‌లో ఉగ్రదాడి, ఏడుగురి మృతి.. 70 మందికి గాయాలు, మదర్సాలో పేలిన బాంబు, విచారణ చేపట్టిన పెషావర్ పోలీసులు
ఓ శిక్షణ స్కూల్‌లో జరిగిన పేలుడులో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 70 మందికి గాయాలయ్యాయని ( Peshawar Kills 7 Children, Wounds 70) పాక్ మీడియా తెలిపింది. మృతుల్లో నలుగురు 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్న విద్యార్థులు ఉన్నారని వైద్యులు తెలిపారు. గాయాలపాలైన వారిలో ఇద్దరు టీచర్లు ఉన్నట్లు చెప్పారు.
Peshawar, October 27: దాయాది దేశం పాకిస్థాన్‌లోని (Pakistan) పెషావర్, దిర్ కాలనీలోని ఓ మదర్సాలో ఈ రోజు ఉదయం భారీ ఉగ్రదాడి (Peshawar Blast) జరిగింది. ఓ శిక్షణ స్కూల్‌లో జరిగిన పేలుడులో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 70 మందికి గాయాలయ్యాయని ( Peshawar Kills 7 Children, Wounds 70) పాక్ మీడియా తెలిపింది. మృతుల్లో నలుగురు 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్న విద్యార్థులు ఉన్నారని వైద్యులు తెలిపారు. గాయాలపాలైన వారిలో ఇద్దరు టీచర్లు ఉన్నట్లు చెప్పారు.
మదర్సాలో ఓ సమావేశం జరుగుతోన్న సమయంలో చాలా మంది వచ్చారని, అదే సమయంలో ఓ పేలుడు (Powerful Bomb Blast) సంభవించిందని అధికారులు చెప్పారు. ఉగ్రవాదులు పేలుడు కోసం ఐఈడీ వాడారని ప్రాథమికంగా తెలిసిందని పోలీసులు చెప్పారు. ఈ ఉగ్రదాడికి బాధ్యులు ఎవరో తెలియరాలేదని వివరించారు. గాయాలపాలైన వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలిస్తున్నామని చెప్పారు. పేలుడు ధాటికి మసీదులోని ప్రార్థనామందిరం పూర్తిగా ధ్వంసమైంది. సీలింగ్ కూడా ఊడిపడింది. అయితే ఇదేమీ ఆత్మాహుతి దాడి కాదు అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మసీదులో ఉన్న బ్యాగులో పేలుడు పదార్ధాలు ఉండి ఉంటాయని అనుమానిస్తున్నారు
పేలుడు ఘటనకు సంబంధించి విచారణ చేపట్టనున్నట్లు పేషావర్ పోలీసు ఆఫీసర్ మన్సూర్ అమన్ తెలిపారు. ఐఈడీతో పేలుడుకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు.. క్లూస్ సేకరిస్తున్నారు. స్కూల్‌లో ఖురాన్ పాఠాలు బోధిస్తున్న సమయంలో పేలుడు జరిగినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. ఎవరో ఓ వ్యక్తి బ్యాగ్‌తో ఆ శిక్షణాలయంలోకి వెళ్లినట్లు తెలిపారు.
గాయపడ్డవారిలో చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. మతపరమైన శిక్షణ తరగతులు జరుగుతున్న బిల్డింగ్‌లో పేలుడు జరగడం వల్ల చిన్నారులు, శిక్షకులు ఎక్కువ సంఖ్యలో గాయపడ్డారు. బ్యాగ్‌లో ఉన్న బాంబు.. టైమ్ బాంబు అయి ఉంటుందని కూడా భావిస్తున్నారు. దాదాపు అయిదు కిలోల పేలుడు పదార్దాలు వాడినట్లు అనుమానిస్తున్నారు.