'I Feel so Powerful, I'll Kiss Everyone': నేను అందరినీ గాఢంగా ముద్దుపెట్టుకోగలను, చాలా బలంగా ఉన్నాను, ఫ్లోరిడా ప్రచార సభలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు, అమెరికా అధినేతకు కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపిన వైట్ హౌస్
US President Donald Trump (Photo Credits: Getty Images/File)

Florida, October 13: కరోనావైరస్ సోకి దాదాపు 10 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా ఫ్లోరిడాలో జరిగిన ప్రచార సభలో (Donald Trump Returns to Campaign) కీలక వ్యాఖ్యలు చేశారు. "నేను కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డాను. నా శరీరంలో రోగ నిరోధక శక్తి పూర్తిగా ఉంది" అని ఆయన అన్నారు. "నేనిప్పుడు చాలా బలంగా ఉన్నాను. అద్భుతమైన శక్తి నాలో ప్రవేశించింది. నేను ఎవరి మధ్యకైనా వచ్చి, మీలో ఎవరినైనా ముద్దు పెట్టుకోగలను ('I Feel so Powerful,I'll Kiss Everyone'). ఎవరికైనా గట్టిగా ముద్దివ్వగలను" అని వందలాది మంది మద్దతుదారుల కేరింతల మధ్య ట్రంప్ వ్యాఖ్యానించారు.

కాగా, ట్రంప్ శరీరం నుంచి వైరస్ పూర్తిగా బయటపడిందని, ఆయన్నుంచి ఇక ఎవరికీ వైరస్ వ్యాపించదని వైట్ హౌస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో 22 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ పోరులో ఆయన డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ ను ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే మూడు వారాల్లో విస్తృతంగా పర్యటించి, తన ప్రచారాన్ని నిర్వహించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలలో బైడెన్ తో పోలిస్తే, ట్రంప్ వెనుకబడివున్నారని తేల్చిన నేపథ్యంలో, ఆయన నష్ట నివారణ చర్యల్లో ఉన్నారని తెలుస్తోంది.

కరోనా వచ్చినా మాస్క్ లేకుండా ఫోటోలకు ఫోజు ఇచ్చిన ట్రంప్, మిలటరీ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్, తీవ్రస్థాయిలో వెలువెత్తుతున్న విమర్శలు, అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న బైడెన్

ఇక ట్రంప్‌ ఫ్లోరిడా పర్యటనకు (Campaign Trail in Florida) ముందు ఆయనకు నిర్వహించిన కరోనా టెస్ట్‌లో నెగెటివ్‌ (Donald Trump Corona Negative) వచ్చిందని అధ్యక్షుడి వైద్య బృందం వెల్లడించింది. నవంబర్‌ 3న జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందు కీలక రాష్ట్రాలను చుట్టిరావాలని ట్రంప్‌ ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారం రోజుల తర్వాత ఫ్లోరిడా క్యాంపెయిన్‌లో ట్రంప్‌ ఏకంగా గంట సేపు మాట్లాడారు. హిల్లరీ క్లింటన్‌పై విమర్శల నుంచి మీడియా అవినీతి ప్రస్తావన, లెఫ్ట్‌కు హెచ్చరికలు, సోషలిస్ట్‌లపై విరుచుకుపడుతూ ట్రంప్‌ తనదైన దూకుడు ప్రదర్శించారు.

అమెరికాను వణికిస్తున్న మరో వైరస్, మెదడును తినే అమీబాతో ఆరేళ్ల బాలుడి మృతి, విపత్తు ప్రకటనను జారీ చేసిన టెక్సాస్ ప్రభుత్వం

స్లీపీ జో’ అంటూ తన ప్రత్యర్ధిపైనా చురకలు వేస్తూ ట్రంప్‌ ప్రసంగం సాగింది. మరో 22 రోజుల్లో ఫ్లోరిడాలో తాము గెలుపొందుతామని, వైట్‌హౌస్‌లో మరో నాలుగేళ్లు కొనసాగుతామని స్పష్టం చేశారు. ‘మరోవైపు కరోనా వైరస్ వెంటాడుతున్నా ట్రంప్‌ భారీ సభలు, మాస్క్‌ లేకుండా కలియతిరగడం వంటి చర్యలతో ప్రచార పర్వం సాగిస్తుంటే జో బిడెన్‌ మాత్రం కోవిడ్‌-19 మార్గదర్శకాలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ ప్రచార ఈవెంట్లను నిర్వహిస్తున్నారు.