virus Spread (Photo Credit: IANS)

Texas, Sep 30: కరోనాతో కుదేలయిన అమెరికాకు మరో వైరస్ ముప్పును తెచ్చిపెట్టేందుకు రెడీ అయింది. మెదడును తినే అమీబాను (Brain-Eating Amoeba) ఒకదాన్నిటెక్సాస్ లో స్థానిక నీటి సరఫరా వ్యవస్థలో (local water supply) టెక్సాస్‌ అధికారులు గుర్తించారు. ఈ అమీబా కారణంగా ఇప్పటికే ఓ ఆరేళ్ల బాలుడు మరణించడంతో ప్రభుత్వం (Texas Government) వెంటనే విపత్తు ప్రకటనను జారీ చేసింది. జాక్సన్‌ సరస్సులో నీటిని పరీక్షించిన తర్వాత దానిలో మెదడును తినే అమీబా చేరినట్లు సీడీసీ నిపుణులు వెల్లడించారు.

అమెరికాలోని టెక్సాస్ సంయుక్త రాష్ట్రంలో ఆరేళ్ల బాలుడు జోసియా మైక్‌ ఇంటైర్‌ కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యి మరణించాడు. అతడిని పరీక్షించిన వైద్యులు జోసియా తలలో అరుదైన మెదడును తినే అమీబాను గుర్తించారు. దీని కారణంగానే అతడు మరణించినట్లు వెల్లడించిన వైద్యులు దాని మూలాలను కనుగోనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జాక్సన్‌ సరస్సులో ఈ అమీబా (Amoeba) బయటపడింది. జోసియా ఈ నీటితో ఆడటం లేదా తాగడం చేసినప్పుడు అమీబా తలలోకి చేరి.. మరణానికి దారి తీసిందని వైద్యులు వెల్లడించారు.

కరోనా మరణాలు తీవ్రంగా పెరిగే అవకాశం, ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ, ప్రపంచదేశాలు సమిష్టి చర్యలు తీసుకోకపోతే మరణాలు 20 లక్షలకు చేరే అవకాశం ఉందని తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

నీరు తాగినప్పుడు అమీబా ముక్కు నుంచి మెదడులోకి వెళ్లి క్రమంగా తినడం ప్రారంభిస్తుందని వైద్యులు తెలిపారు. దీనికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే మరణం తప్పదని హెచ్చరించారు. దాతో అధికారులు ప్రజలు ఎవరూ కూడా టాప్ వాటర్ తాగొద్దని, వంట చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే బాగా వేడి చేసిన తర్వాతే తాగడానికి వాడాలని సూచించారు. ప్రస్తుతం ఇక్కడ క్లోరినేషన్‌ జరుగుతోంది.

చైనా నుంచి మరో ప్రమాదకర వైరస్, క్యూలెక్స్‌ దోమ ద్వారా క్యాట్‌ క్యూ వైరస్‌, కర్ణాటకలో ఇద్దరికీ సోకిన సీక్యూవీ, జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ హెచ్చరిక

నీటిని ఇష్టపడే అమీబా తరచుగా వెచ్చని సరస్సులు, నదులు, హోస్ట్ స్ప్రింగ్‌లలో కనిపిస్తుందని అధికారులు అన్నారు . ఈ ప్రదేశాలలో ఈత కొట్టేటప్పుడు ప్రజలు సాధారణంగా వ్యాధి బారిన పడతారు. ఈ సూక్ష్మజీవి ముక్కు పైకి చేరి అక్కడి నుంచి మెదడులోకి ప్రయాణిస్తుంది. అక్కడ ఇది కణజాలాన్ని నాశనం చేస్తుంది. ఫలితంగా మెదడు వాపు, మరణానికి కారణమవుతుంది. ఇక ఈ వ్యాధి సోకినవారిలో తలనొప్పి, జ్వరం, వాంతులు, సమతుల్యత కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని అధికారులు తెలిపారు.