Locking Graves In Pakistan: శవాలను కూడా వదలని కామాంధులు, సమాధులు తవ్విమరీ రేప్ చేస్తున్న దుర్మార్గులు, తమ బిడ్డల మానాలు కాపాడుకునేందుకు సమాధులకు తాళాలు వేస్తున్న తల్లిదండ్రులు, పాకిస్థాన్‌లో కిరాతక చర్య
శ్మశానంలో ఖననం చేసిన మహిళల మృతదేహాలను బయటకు తీసి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దాయాది దేశమైన పాకిస్థాన్‌లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరణించిన తమ కుమార్తెల మానాన్ని, గౌరవాన్ని కాపాడుకునేందుకు వారి తల్లిదండ్రులు ఆ సమాధులకు తాళాలు వేస్తున్నారు
Islamabad, April 29: చనిపోయిన మహిళలను కూడా కామ రాక్షసులు వదలడం లేదు. శ్మశానంలో ఖననం చేసిన మహిళల మృతదేహాలను బయటకు తీసి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దాయాది దేశమైన పాకిస్థాన్‌లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరణించిన తమ కుమార్తెల మానాన్ని, గౌరవాన్ని కాపాడుకునేందుకు వారి తల్లిదండ్రులు ఆ సమాధులకు తాళాలు వేస్తున్నారు (locking daughters’ graves). పాకిస్థాన్ రచయితలతో సహా ఆ దేశానికి చెందిన సామాజిక కార్యకర్తలు ఈ సమస్యను ప్రస్తుతం హైలైట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మాజీ ముస్లిం నాస్తిక కార్యకర్త,‘ది కర్స్ ఆఫ్ గాడ్, నేను ఇస్లాంను ఎందుకు విడిచిపెట్టాను’ అనే పుస్తక రచయిత హారిస్ సుల్తాన్ బుధవారం ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టారు. పాకిస్థాన్‌లో జరుగుతున్న ఇలాంటి దుర్మార్గపు చర్యలకు కఠినమైన ఇస్లామిక్ భావజాలం కారణమని ఆయన నిందించారు. ‘లైంగికంగా నిరాశతో కూడిన సమాజాన్ని పాకిస్థాన్ సృష్టించింది. ప్రజలు ఇప్పుడు తమ కుమార్తెల మృతదేహాలు అత్యాచారానికి గురికాకుండా వారి సమాధులకు తాళాలు వేస్తున్నారు. బురఖాను రేప్‌తో ముడిపెడితే, అది సమాధి వరకు మిమ్మల్ని అనుసరిస్తుంది’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఒక సమాధికి తాళం వేసిన ఫొటోను షేర్ చేశారు.
కాగా, పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ నివేదిక ప్రకారం, 40 శాతం కంటే ఎక్కువ మంది పాకిస్థానీ మహిళలు తమ జీవితకాలంలో ఒక్కసారైనా లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు. ఆ దేశంలో ప్రతి రెండు గంటలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతున్నది. అలాగే గత కొంత కాలంగా శ్మశానంలో ఖననం చేసిన మహిళల మృతదేహాలపైనా లైంగిక దాడులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన నెక్రోఫిలియా కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నది. 2011లో కరాచీలోని ఉత్తర నజీమాబాద్‌లో శ్మశాన వాటికలో పని చేసే ముహమ్మద్ రిజ్వాన్, 48 మహిళా శవాలపై అత్యాచారం చేశాడు. అతడి అరెస్ట్‌తో ఈ విషయం వెలుగులోకి రావడం పాకిస్థాన్‌లో కలకలం రేపింది.
అలాగే 2022 మేలో కూడా పాకిస్థాన్‌లో ఇలాంటి సంఘటన జరిగింది. అక్కడి గుజరాత్‌లోని చక్ కమలా గ్రామంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు యువతి శవాన్ని బయటకు తీసి అత్యాచారం చేశారు. బాలిక మృతదేహాన్ని ఖననం చేసిన ఆ సాయంత్రమే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఇలాంటి కామ రాక్షసుల బారి నుంచి చనిపోయిన మహిళల పవిత్రత, మానాన్ని కాపాడుకునేందుకు కొందరు వారి సమాధులకు తాళాలు ఏర్పాటు చేస్తున్నారు.
సాజిద్ యూసఫ్ షా అనే ట్విట్టర్ యూజర్ కూడా ఈ అంశంపై స్పందించాడు. ‘పాకిస్థాన్ సృష్టించిన సామాజిక వాతావరణం.. లైంగిక వేధింపులు, అణచివేతతో కూడిన సమాజానికి దారితీసింది. మరణించిన తమ కుమార్తెలను లైంగిక హింస నుంచి కాపాడుకునేందుకు కొంతమంది వారి సమాధులకు తాళాలు వేస్తున్నారు. ఇలాంటి అత్యాచారాలు.. శోకం, నిరాశతో కూడిన ఇటువంటి మార్గాలకు (సమాధులకు తాళం) దారి తీస్తున్నది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు