Philippines Plane Crash: ఘోర ప్రమాదం..కుప్పకూలిన విమానం, 17 మంది మృతి, 40 మందిని రక్షించిన అధికారులు, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం, విమానంలో మొత్తం 92 మంది సైనికులు, ఫిలిప్పీన్స్‌లో విషాద ఘటన

92 మంది సైనికులతో వెళ్తున్న ఎయిర్ ఫోర్స్ విమానం సీ-130 (C-130 Military Plane) జోలో ద్వీపం వద్ద కుప్పకూలింది. వీరిలో ముగ్గురు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కాగా.. మిగతావారంతా సైనికులు. ఈ ఘటనలో కనీసం 17 మంది మరణించినట్లు ఆర్మీ చీఫ్‌ సిరిలిటో సొబెజనా తెలిపారు.

Philippines Plane Crash (Photo Creduts: Twitter)

Manila, Jul 4: ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం (Philippines Plane Crash) చోటు చేసుకుంది. 92 మంది సైనికులతో వెళ్తున్న ఎయిర్ ఫోర్స్ విమానం సీ-130 (C-130 Military Plane) జోలో ద్వీపం వద్ద కుప్పకూలింది. వీరిలో ముగ్గురు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కాగా.. మిగతావారంతా సైనికులు. ఈ ఘటనలో కనీసం 17 మంది మరణించినట్లు ఆర్మీ చీఫ్‌ సిరిలిటో సొబెజనా తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో 40 మంది జవాన్లను రక్షించినట్లు (7 Dead, 40 Rescued) సొబెజనా పేర్కొన్నారు. మిగతావారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు.

ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో విమానం ల్యాండ్‌ అవుతుండగా రన్‌వేను చేరుకోవడంలో ఫ్లైట్‌ విఫలమవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సొబెజనా తెలిపారు. విమానంలో ఉన్నవారంతా ఇటీవలే ప్రాథమిక సైనిక శిక్షణ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లని సమాచారం. ఉగ్రవాదంపై పోరు కోసం ఏర్పాటు చేసిన సంయుక్త కార్యదళంలో వీరిని చేర్చేందుకు విమానంలో తరలిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. జోలో ద్వీప సమీపంలో ఉగ్రవాద కార్యకలాపాలు అధికంగా జరుగుతుంటాయి.

కోవాక్సిన్ కుంభకోణం..బ్రెజిల్ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారోపై దర్యాప్తుకు ఆదేశాలిచ్చిన బ్రెజిల్ సుప్రీంకోర్టు, 90 రోజుల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని గడువు, కరోనా కట్టడిలో బొల్సొనారో విఫలమయ్యారంటూ ప్రతిపక్షాల విమర్శలు

Here's Update

దక్షిణ కగయాన్‌ డీ ఓరో నగరం నుంచి 85 మంది సిబ్బందిని తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపం దగ్గర పాటికుల్ అనే పర్వత పట్టణంలోని బంగ్‌కాల్ విలేజ్‌లో ల్యాండ్‌ అయ్యే సమయంలో విమానం నేలకూలగా.. అనంతరం మంటలు చెలరేగాయి. విమానం రన్‌వేను మిస్ కావడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు సమాచారం. ముస్లిం ప్రావిన్స్ సులులో ప్రభుత్వ దళాలు దశాబ్దాలుగా అబూ సయ్యఫ్ ఉగ్రవాదులతో పోరాడుతున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదంపై పోరాడే ఉమ్మడి టాస్క్‌ పోర్స్‌లో భాగంగా వారిని ఆ ఐలాండ్‌లో మోహరించేందుకు తరలించినట్లు తెలుస్తోంది.