Brasília, July 4: భారతదేశంలో తయారు చేసిన కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవాక్సిన్ సేకరణలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కుంటున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై దర్యాప్తుకు బ్రెజిల్ సుప్రీంకోర్టు (Brazil Supreme Court) అదేశాలు జారీ చేసింది. కొవాగ్జిన్ డీల్‌కు సంబంధించి ముడుపుల ఆరోపణలపై ( probe into President Jair Bolsonaro), ముఖ్యంగా ఆ ఆరోపణల్లో అధ్యక్షుడు జైర్ బొల్సొనారో (President Jair Bolsonaro) కార్యాలయం పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేయాలని బ్రెజిల్ సుప్రీం కోర్టు, బ్రెజిల్ అత్యున్నత విచారణ&దర్యాప్తు బృందాలను ఆదేశించింది.
శుక్రవారం రాత్రి హడావిడిగా ఆదేశాలను జారీ చేసిన జస్టిస్ రోసా వెబర్.. 90 రోజుల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని గడువు విధించారు. మరోవైపు బ్రెజిల్ కాగ్(సీజీయూ)ను ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని న్యాయస్థానం కోరింది. జూలై 2 న ఇచ్చిన తీర్పులో, సుప్రీంకోర్టు జస్టిస్ రోసా వెబెర్, కోవాక్సిన్ సేకరించే ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో బోల్సోనారోపై దర్యాప్తును టాప్ ప్రాసిక్యూటర్ కార్యాలయం లేదా పిజిఆర్ చేయవలసి ఉందని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.
వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోసం బ్రెజిల్ మధ్యవర్తితో 20 మిలియన్ మోతాదులకు ఫిబ్రవరిలో సంతకం చేసిన 1.6 బిలియన్ రీస్ (6 316 మిలియన్) ఒప్పందానికి సంబంధించిన అవకతవకలకు సంబంధించి అధ్యక్షుడు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. మహమ్మారిని అరికట్టడంలో విఫలం అయ్యారని ప్రతిపకషాలు విమర్శలు గుప్పిస్తున్నాయి, ఈ నేపథ్యంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బ్రెజిలియన్ సెనేట్ కమిషన్ ఒప్పందానికి సంబంధించిన అధిక ధర మరియు అవినీతి జరిగిందని పేర్కొంది.
ఇదిలా ఉంటే కరోనాను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడంటూ అధ్యక్షుడికి వ్యతిరేకంగా వేల మంది యాంటీ-బొల్సొనారో ఉద్యమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనాతో ఐదు లక్షల మంది ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడంటూ బొల్సొనారోపై హత్యాయత్నం కేసులు సైతం నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ ముడుపుల ఆరోపణలు రావడంతో వాళ్లలో మరింత ఆగ్రహం పెల్లుబిక్కింది.
మూడురోజులుగా రోడెక్కి నిరసనలతో హోరెత్తిస్తున్నారు. శనివారం సైతం పార్లమెంట్ ఆవరణలో వీళ్లు నిరసనలు చేపట్టారు. ఇక బొల్సొనారోను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. పాత-కొత్త ఆరోపణలు(కొవాగ్జిన్ డీల్ అంశం సహా), వివాదాలను ప్రస్తావిస్తూ ఈ వారంలోనే పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నాయి.