'PM Modi in Pakistan': పాకిస్తాన్‌లో మార్మోగిన ప్రధాని మోదీ పేరు, పాక్ నుంచి స్వాతంత్య్రం కావాలంటున్న సింధీలు, అంతర్జాతీయ నేతల ఫొటోలు ఉన్న ప్లకార్డులతో ప్రదర్శనలు
పొరుగుదేశం పాకిస్థాన్‌లో భారత ప్రధాని నరేంద్రమోదీ పోస్టర్లు దర్శనమిచ్చాయి. తమకు పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం కావాలని పోరాడుతున్న సింధీలు సోమవారం సింధ్ రాష్ట్రంలో నిర్వహించిన ర్యాలీలో మోదీ ఫొటోలు ఉన్న పోస్టర్లను (PM Naredra Modi's posters raised) పట్టుకొన్నారు. ప్రజలంతా ఆయన ఫ్లకార్డులు పట్టుకుని.. తమకు మద్దతునివ్వాల్సిందిగా (PM Modi Slogans In Pakistan) మోడీని అభ్యర్థించారు.
Sindh, Jan 19: పొరుగుదేశం పాకిస్థాన్‌లో భారత ప్రధాని నరేంద్రమోదీ పోస్టర్లు దర్శనమిచ్చాయి. తమకు పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం కావాలని పోరాడుతున్న సింధీలు సోమవారం సింధ్ రాష్ట్రంలో నిర్వహించిన ర్యాలీలో మోదీ ఫొటోలు ఉన్న పోస్టర్లను (PM Naredra Modi's posters raised) పట్టుకొన్నారు. ప్రజలంతా ఆయన ఫ్లకార్డులు పట్టుకుని.. తమకు మద్దతునివ్వాల్సిందిగా (PM Modi Slogans In Pakistan) మోడీని అభ్యర్థించారు. నరేంద్ర మోదీతో పాటు జో బైడెన్, వ్లాదిమిర్ పుతిన్, బోరిస్ జాన్సన్, ఎంజెలా మెర్కెల్ తదితర అంతర్జాతీయ నేతల ఫొటోలు ఉన్న ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహించారు. తమ స్వాతంత్య్రోద్యమంలో జోక్యం చేసుకోవాలని ఆ నేతలకు విజ్ఞప్తి చేశారు.
పాక్ ప్రభుత్వం తమను ఆక్రమించుకుని నానా హింసలు పెడుతున్నదని.. తమకు మద్దతు ఇవ్వాలని అంతర్జాతీయ నేతలను నిరసన ద్వారా కోరారు. పాక్ ప్రభుత్వ వైఖరి నశించాలని డిమాండ్ చేశారు. తమకు స్వతంత్య్రం ఇవ్వాల్సిందేనని... లేకుంటే తిరుగుబాటు తప్పదని సింధీలు (Sindh province) హెచ్చరించారు. సింధీ జాతీయవాద వ్యవస్థాపక పితామహుల్లో ఒకరైన జిఎం సయ్యద్ 117 వ జయంతి సందర్భంగా నిర్వహించిన భారీ స్వాతంత్య్ర అనుకూల ర్యాలీలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
తాము స్వేచ్ఛ కోసం ఆరాటపడుతున్నామని.. తమకు మద్దతు కావాలని కోరుతూ పాకిస్తాన్ లోని సింధ్ ప్రజలు ఈ భారీ నిరసన చేపట్టారు. సింధ్ గురించి పలువురు నిరసనకారులు మాట్లాడుతూ... ‘సింధ్ ఓ వేద భూమి.. ఈ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉన్నది. ప్రపంచంలోని అతి పురాతనమైన నాగరికతలలో ఒకటిగా ఉన్న సింధు లోయ నాగరికతకు ఈ ప్రాంతం పుట్టినిల్లని అన్నారు.
Here's ANI Update:
ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఆక్రమణదారుల పాలన సాగుతుందని.. ఇక్కడి వనరులను పాక్ ఆక్రమించుకుని.. చరిత్రను, సంస్కృతీ, సంప్రదాయాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా దాని కుట్రలు ఫలించడం లేదు. ఎంత ఒత్తిళ్లు తెచ్చినా.. ఎన్ని కుట్రలు చేస్తున్నా.. ఇక్కడి ప్రాంత ప్రజలు మాత్రం సింధ్ కు ఉన్న ప్రత్యేక సంస్కృతిని కాపాడుకుంటున్నారు. దాని గుర్తింపును అలాగే కాపాడుతున్నారు. సామరస్యపూర్వకంగా కలిసి మెలిసి జీవిస్తూ.. సహనాన్ని చాటుతున్నారు. కానీ పాక్ మాత్రం మాపై ఆక్రమణకు దిగుతోందని అన్నారు.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే పాక్ సైన్యం.. హక్కుల కార్యకర్తలను జైళ్లలో పెడుతూ.. వారికి అనుకూలంగా మాట్లాడిన వారిని హింసిస్తూనే ఉన్నది. ఈ నేపథ్యంలొ సింధ్ ప్రజలంతా మోదీతో పాటు అంతర్జాతీయ నేతలు ఇందులో జోక్యం చేసుకోవాలని కోరారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)