Covid-19 Variants: కొత్త వేరియంట్లతో 4వ వేవ్ ముప్పు, అమెరికాలో సగటున రోజూ 2 వేల మంది దాకా చనిపోతున్నారంటూ హెచ్చరికలు జారీ చేసిన సీడీసీ, అమెరికాను వణికిస్తున్న B.1.1.7 వేరియంట్
కరోనా వైరస్‌లో వస్తున్న జన్యు మార్పుల వల్ల అమెరికాకు నాలుగో వేవ్ ముప్పు (potential fourth surge of coronaviru cases in US) పొంచి ఉందని అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) (US Centers for Disease Control and Prevention (CDC)చీఫ్ డాక్టర్ రోచెల్లీ వాలెన్ స్కీ హెచ్చరించారు.
New Delhi, Mar 2: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కల్లోలం రేపుతోంది. అది కొత్త జన్యువులను సంతరించుకుని మానవాళిని ముప్పతిప్పలు పెడుతోంది. ఇప్పటికే వివిధ దేశాల్లో పుట్టిన కొత్త వేరియంట్లు (Covid-19 Variants) అన్ని దేశాలకు విస్తరించాయి. వ్యాక్సినేషన్ వచ్చినప్పటికీ కొత్త వేరియంట్ల రాకతో కేసుల్లో రొజు రోజుకు పెరుగుదుల కనిపిస్తోంది. కాగా కరోనావైరస్ బారీన పడిన జాబితాల్లో అమెరికా అగ్రభాగాన నిలిచిన సంగతి విదితమే.
ఇక కరోనా వైరస్‌లో వస్తున్న జన్యు మార్పుల వల్ల అమెరికాకు నాలుగో వేవ్ ముప్పు (potential fourth surge of coronaviru cases in US) పొంచి ఉందని అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) (US Centers for Disease Control and Prevention (CDC)చీఫ్ డాక్టర్ రోచెల్లీ వాలెన్ స్కీ హెచ్చరించారు. కొత్తగా వస్తున్న కరోనావైరస్ వేరియంట్లతో పెను ప్రమాదం పొంచి ఉందని ఆమె హెచ్చరించారు. గత వారం అమెరికాలో రోజూ సగటున 70 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని, అది చాలా తీవ్రమైన విషయమని ఆమె (Dr Rochelle Walensky) అన్నారు. సగటున రోజూ 2 వేల మంది దాకా చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కొన్ని రోజులు నియంత్రణలోనే ఉన్న కరోనా కేసులు.. ఇప్పుడు కొత్త రకం కరోనాతో మరింత పెరుగుతున్నాయన్నారు. బ్రిటన్ వేరియంట్ అయిన బీ.1.1.7 (B.1.1.7 Variant) తోనే అమెరికాలో ఎక్కువ కేసులు వస్తున్నాయన్నారు. వ్యాక్సినేషన్ పై ఈ కొత్త రకం కరోనా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి కేసులు మరిన్ని పెరిగే లోపే వీలైనంత ఎక్కువ మందికి కరోనా టీకాలు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాల ప్రకారం, ఇప్పటిదాకా అమెరికాలో 7.6 కోట్ల మందికి కరోనా టీకాలు వేశారు. వ్యాక్సినేషన్ లో ఆ దేశం అగ్రస్థానంలో నిలిచింది. కాగా, దేశంలో 2 కోట్ల 93 లక్షల 14 వేల 254 మంది కరోనా బారిన పడగా.. 5 లక్షల 27 వేల 226 మంది బలయ్యారు.
కోవిడ్ -19 వ్యాప్తిలో అనేక రకాల కొత్త వేరియంట్లు ఉన్నాయి.ఆరోగ్య నిపుణులు ప్రత్యేకించి UK, దక్షిణాఫ్రికా మరియు బ్రెజిల్‌లలో మొదట కనుగొనబడిన వాటితో సహా మరిన్ని అంటువ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయి. UK లో మొదట కనుగొనబడిన B.1.1.7 వేరియంట్ ఈ నెలలో US ను ముప్పతిప్పలు పెట్టేందుకు రెడీ అవుతోందని CDC అంచనా వేసింది. సిడిసి డేటా ప్రకారం, ఆందోళన యొక్క వైవిధ్యాలతో కూడిన 2,463 కంటే ఎక్కువ అంటువ్యాధులు నివేదించబడ్డాయి. ఆ కేసులలో ఎక్కువ భాగం - కనీసం 2,400 - UK వేరియంట్‌కు చెందినవి.