India Covid Updates: వేసవిలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్న నిపుణులు, దేశంలో తాజాగా 12,286 మందికి కరోనా, ఏపీలో 58 కొత్త కేసులు, మహారాష్ట్రలో కొత్తగా 6,397 కరోనా కేసులు, దేశంలో ప్రారంభమైన రెండో దశ వ్యాక్సిన్ పంపిణీ
2020 Coronavirus Pandemic in India (photo-Ians)

New Delhi, Mar 2: దేశంలో గత 24 గంటల్లో 12,286 మందికి కరోనా నిర్ధారణ (India Covid Updates) అయింది. అదే స‌మ‌యంలో 12,464 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,24,527కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 91 మంది కరోనా కారణంగా మృతి (Coronaviru Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,248కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,98,921 మంది కోలుకున్నారు.

1,68,358 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,48,54,136 మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 21,76,18,057 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,59,283 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

దేశంలో కరోనా వ్యాక్సిన్ రెండో దశ పంపిణీ మొదలైంది. ఈ దశలో వ్యాక్సిన్ కోసం తొలి రోజు దాదాపు 25 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 24.5 లక్షల మంది సాధారణ ప్రజలు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మిగతా వారిలో వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు ఉన్నట్టు పేర్కొంది. 60 ఏళ్లు పైబడిన వారు, 45 ఏళ్లు దాటి కోమార్బిడిటీస్‌తో బాధపడుతున్న వారు టీకా కోసం కొ-విన్ 2.0 పోర్టల్, ఆరోగ్యసేతు యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. నిన్నటి నుంచే ఈ వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇలా చేసుకోలేనివారు వ్యాక్సిన్ కేంద్రాలకు నేరుగా వెళ్లి కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

మానవాళిపై మరో కొత్త వైరస్ దాడి, రష్యాలో జంతువుల నుంచి మానవుల శరీరంలోకి H5N8 వైరస్‌, డిసెంబర్‌లో పక్షుల్లో బయటపడిన వైరస్, అప్రమత్తం అయిన రష్యా

మహారాష్ట్రలో ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 6,397 కరోనా కేసులు, 30 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,61,467కు, మరణాల సంఖ్య 52,184కు చేరింది. మరో వైపు గత 24 గంటల్లో 5,754 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 20,30,458కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 77,618 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న అమరావతి, అచల్‌పూర్‌లో లాక్‌డౌన్‌ను మరో వారం రోజులు పొడిగించారు. ఈ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఆంక్షలు విధించారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.

విరుచుకుపడుతున్న కొత్త వేరియంట్లు, భారత్‌లో ఏకంగా ఐదు వేల రకాల కరోనా స్ట్రెయిన్లు, సంచలన వివరాలను వెల్లడించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు

ఏపీలో గడచిన 24 గంటల్లో 20,269 కరోనా పరీక్షలు నిర్వహించగా 58 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 10 పాజిటివ్ కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. కృష్ణా, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. అదే సమయంలో 51 మంది కరోనా నుంచి కోలుకోగా, ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,89,974 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,080 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 725 మందికి చికిత్స జరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,169 మంది కరోనాతో మృతి చెందారు.

వేసవిలో ఎండల తీవ్రతకి ప్రజలు ఇండ్లలోనే ఉంటారని, దీని వల్ల భారత్‌లో కరోనా కేసులు పెరుగవచ్చని కెనడాకు చెందిన భారతీయ శాస్త్రవేత్త ప్రభాత్‌ ఝా హెచ్చరించారు. గాలి వెలుతురు సరిగా లేని ఇండ్లలో కరోనా వ్యాపించే ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ‘చలి తీవ్రతతో ప్రజలు ఇండ్లకే పరిమితమవడంతో కెనడా వంటి దేశాల్లో శీతాకాలంలో కరోనా కేసులు పెరిగాయి. అలాగే వేసవిలో భారత్‌లో కేసులు పెరిగే ప్రమాదముంద’ని పేర్కొన్నారు. టొరంటో వర్సిటీకి చెందిన యూనిటీ హెల్త్‌ సెయింట్‌ మైఖేల్‌ దవాఖాన ఎపిడమాలజిస్ట్‌గా ప్రభాత్‌ పనిచేస్తున్నారు. గ్లోబల్‌ హెల్త్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు.