COVID-19 in Spain: కరోనా కాటుకు బలైన స్పెయిన్ రాణి, పారిస్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మారియా థెరీసా, స్పెయిన్‌లో 73 వేలకు చేరిన కరోనా కేసులు
ఆమె వయసు 86 ఏళ్లు. ప్రాణాంతక వైరస్ బారిన పడిన యువరాణి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసిన మారియా స్పెయిన్ రాజు ఫెలిప్-6కు సోదరి. 1933 జులై 28 న ఆమె జన్మించారు. ఫ్రాన్స్‌లో చదువుకున్న మారియా సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించి ‘రెడ్ ప్రిన్సెస్’గా పేరు సంపాదించారు.
Washington D.C, March 29: కరోనా వైరస్ (Coronavirus) విజృంభనతో ప్రపంచ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. లాక్‌డాన్ (Lockdown) ప్రకటించుకుని నాలుగు గోడల మధ్య మగ్గిపోతున్నాయి. అయినప్పటికి వైరస్ తగ్గుముఖం పట్టడంలేదు. రోజురోజుకు కరోనా (Corona) పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. స్పెయిన్‌లో (Spain) పరిస్థితులు మరింత భీతావహంగా ఉన్నాయి. వైరస్ మరణాల సంఖ్య కరోనా పుట్టిల్లు చైనాను (China) దాటిపోయింది.
ఈ కరోనా మహమ్మారి కరోనాకు (COVID 19) స్పెయిన్ రాణి మారియా థెరీసా (Princess Maria Teresa) బలయ్యారు. ఆమె వయసు 86 ఏళ్లు. ప్రాణాంతక వైరస్ బారిన పడిన యువరాణి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసిన మారియా స్పెయిన్ రాజు ఫెలిప్-6కు సోదరి. 1933 జులై 28 న ఆమె జన్మించారు. ఫ్రాన్స్‌లో చదువుకున్న మారియా సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించి ‘రెడ్ ప్రిన్సెస్’గా పేరు సంపాదించారు.
అమెరికా అల్లకల్లోలం, లక్ష దాటిన కరోనా కేసులు
ఇక ఇటీవల జరిగిన వైరస్ నిర్ధారణ పరీక్షల్లో కింగ్ ఫెలిప్-6కు నెగెటివ్ అని వచ్చింది. బ్రిటన్ రాజకుమారుడు చార్లెస్, ప్రధానమంత్రి బొరిస్ జాన్సన్, ఆరోగ్యశాఖ మంత్రికి కోవిడ్–19 సోకిన సంగతి తెలిసిందే. కాగా, స్పెయిన్‌లో ఇప్పటివరకు 73 వేల కరోనా కేసులు నమోదు కాగా.. 5982 మంది ప్రాణాలు విడిచారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల 60 వేల మంది ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడగా.. 30 వేల మందికి పైగా మరణించారు. మృతుల్లో వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారే అధికంగా ఉండటం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణాలు 30 వేలు దాటాయి. ఒక్క ఇటలీలోనే శనివారం నాటికి 10 వేల మంది చనిపోయారు. యూరప్ ఖండంలోని ఒక్కో దేశాన్ని కబలిస్తున్న వైరస్ స్పెయిన్‌లోనూ విలయం సృష్టిస్తోంది. శనివారం ఆ దేశంలో అత్యధికంగా 832 మంది మృతి చెందడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. 9 వేల మందిపైగా ఆరోగ్య కార్యకర్తలు సైతం వైర్‌సకు గురయ్యారు. ఫ్రాన్స్‌లోనూ రోజుకు 300 మంది కొవిడ్‌కు బలవుతున్నారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు సోకిన కరోనావైరస్
ఇటలీలో పాజిటివ్ కేసులుగా తేలినవారిలో 10.5 శాతం ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రముఖులు సైతం వైర్‌సకు గురవుతుండటంతో యునైటెడ్ కింగ్‌డమ్‌లో భారీఎత్తున పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలో 260 మరణాలు నమోదయ్యాయి. ఆసియాలో కరోనాతో కల్లోలమైన ఇరాన్‌లో మరో 139 మంది చనిపోయారు. పాకిస్థాన్‌లో కేసులు 1400 దాటాయి. 11 మంది మృతిచెందారు. అమెరికాలో పాజిటివ్ కేసులు 1,04,277కు చేరాయి. న్యూ ఒర్లీన్స్, చికాగో, డెట్రాయిట్‌లనూ వైరస్ ప్రభావం కనిపిస్తోంది. న్యూ ఒర్లీన్స్‌లో భారీ కన్వెన్షన్ సెంటర్‌ను తాత్కాలిక ఆసుపత్రిగా మార్చేశారు. కరో నా ఉధృతంగా ఉన్న న్యూయార్క్ వంటి చోట్ల వైద్య సిబ్బంది తీరిక లేకుండా పనిచేస్తున్నారు.