Covid-19 'Methanol Rumours': ఇది తాగితే కరోనావైరస్ చస్తుంది, ఇరాన్‌లో షికార్లు చేస్తున్న పుకార్లు, మెథనాల్‌ తాగి 400 మంది మృతి, 1000 మందికి పైగా అనారోగ్యం, వదంతులు నమ్మవద్దంటున్న వైద్యులు
Coronavirus in Iran. (Photo Credit: PTI)

Tehran, March 28: కరోనావైరస్ (Coronavirus) ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ఈ దేశంలో శరవేగంగా కరోనావైరస్ (Coronavirus Outbreak) వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటివరకు దాదాపు 33వేల మందికి పైగా కరోనా సోకింది. 2400మంది కరోనా కాటుకు బలయ్యారు.

ఇండియాలో 78 మంది రికవరీ

కాగా కరోనా వ్యాప్తిపై ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కాకపోవడంతోనే పెద్దసంఖ్యలో​ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఇరాన్‌ అధికార యంత్రాంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఇరాన్‌ (Iran) అంతటా లాక్‌డౌన్‌ నెలకొన్న క్రమంలో 8 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

అయితే ఈ వార్తలు ఇలా ఉంటే ఇరాన్ లో కరోనావైరస్ కి విరుగుడు ఇదేనంటూ ఓ వార్త చక్కర్లు (Fake News Turns Fatal) కొడుతోంది. మెథనాల్‌ తాగితే (Drinking Methanol) కరోనాని అరికట్టవచ్చని అక్కడ ఫేక్ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కరోనాకు విరుగుడుగా ఇక్కడి ప్రజలు ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌ను సేవిస్తుండటంతో పరిస్థితి విషమిస్తోంది. మెథనాల్‌ ను తాగడంతో ఈనాటివరకు ఇరాన్‌లో 400 మంది మరణించారు.

అమెరికా అల్లకల్లోలం, లక్ష దాటిన కరోనా కేసులు

1000 మందికి పైగా జనం అనారోగ్యానికి గురయ్యారని ఇరాన్‌ మీడియా వెల్లడించింది. అత్యంత ప్రభావవంతమైన ఆల్కహాల్‌ను సేవిస్తే అది వైరస్‌ను చంపివేస్తుందనే అపోహతో పలువురు మెథనాల్‌ను తాగుతున్నారు. మెథనాల్‌ను తాగడం వలన ఇది శరీర భాగాలపై దుష్ప్రభావం చూపిస్తుంది. అలాగే కోమాలోకి వెళ్లిమనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఆల్కహాల్‌ జీర్ణ వ‍్యవస్థను పరిశుద్ధం చేస్తుందనే ప్రచారంలో నిజం లేదని ఇరాన్‌ డాక్టర్‌ జావద్‌ సమన్‌ తెలిపారు. ఇరాన్‌లో ఆల్కహాల్‌పై నిషేధం అమల్లో ఉండగా, సోషల్‌మీడియాలో కరోనాకు విరుగుడు అంటూ సాగుతున్న ప్రచారంతో ఇలాంటి అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. మెథనాల్‌ను వాసన చూడటం, తాగడం చేయరాదని ఇది శరీర భాగాలపై దుష్ర్పభావం చూపడమే కాకుండా మెదడును ధ్వంసం చేస్తుందని వ్యక్తులు కోమాలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

విస్కీ, తేనె సేవించడం ద్వారా కరోనా వైరస్‌ నుంచి బ్రిటన్‌ టీచర్‌ సహా మరికొందరు బయటపడ్డారని ఇరాన్‌ సోషల్‌మీడియాలో మెసేజ్‌లు ముంచెత్తడంతో ప్రజలు ఇలాంటి తప్పుడు సలహాలకు ప్రభావితమై ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారని అధికారులు చెప్పారు. వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజల ప్రాణాలను హరిస్తోందని, ఇక కరోనా కాకుండా ఇతర ప్రమాదాలూ పొంచిఉన్నాయనే అవగాహనా ప్రజల్లో కొరవడిందని క్లినికల్‌ టాక్సికాలజిస్ట్‌ డాక్టర్‌ నట్‌ ఎరిక్‌ హదా అన్నారు. మెథనాల్‌ను సేవించడం మరింత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.