Bronze Age Sword: పురావస్తు తవ్వకాల్లో బయటపడిన 3 వేల ఏళ్లనాటి ఖడ్గం.. ఇప్పటికీ తళతళలాడుతూ మెరుస్తూనే.. జర్మనీలో అరుదైన ఘటన..
పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో కాంస్య యుగానికి చెందిన ఓ ఖడ్గం బయటపడింది. దాదాపు 3 వేల సంవత్సరాలైనా అది ఇప్పటీ ఏమాత్రం వన్నె తగ్గకుండా తళతళలాడుతూ మెరుస్తుండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది.
Newdelhi, June 17: జర్మనీలో (Germany) అరుదైన ఘటన వెలుగుచూసింది. పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో కాంస్య యుగానికి (Bronze Age) చెందిన ఓ ఖడ్గం (Sword) బయటపడింది. దాదాపు 3 వేల సంవత్సరాలైనా అది ఇప్పటీ ఏమాత్రం వన్నె తగ్గకుండా తళతళలాడుతూ మెరుస్తుండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. నార్డ్‌లింగెన్‌లోని బవేరియన్ పట్టణంలో జరిపిన తవ్వకాల్లో ఓ పురుషుడు, మహిళ, ఓ చిన్నారి సమాధిలో ఈ పొడవైన కత్తి కనిపించినట్టు బవేరియన్ స్టేట్ ఆఫీస్ ఫర్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ తెలిపింది. ముగ్గురిని ఒకరి వెంట మరొకరిని ఖననం చేశారని, వారి మధ్య సంబంధం ఏంటనేది తెలియరాలేదని పేర్కొంది.
అష్టభుజ కత్తి రకం
ఖడ్గాన్ని అద్భుతంగా సంరక్షించడంతో అది ఇప్పటికీ నిగనిగలాడుతూ మెరుస్తోంది. ఇది కాంస్య యుగానికి చెందిన అష్టభుజ కత్తి రకం. దీని అష్టభుజి పిడిని పూర్తిగా కాంస్యంతో తయారుచేశారు. నిపుణులైన వారు మాత్రమే ఈ అష్టభుజి ఖడ్గాలను తయారుచేయగలరు.