Tirupati, June 17: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ-TTD) సెప్టెంబరు నెల శ్రీవారి సేవలకు (Srivari Seva) సంబంధించిన టికెట్లను (Tickets) ఆన్ లైన్ (Online)లో విడుదల చేయనుంది. ఈ నెల 19న తిరుమల (Tirumala) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన, ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు ఈ నెల 19 నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో భక్తులు లక్కీడిప్ కోసం తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
Seva Electronic Dip Tickets for the month of September will be available for booking from 19 June. Draw will be done on 21st or later. pic.twitter.com/y5r6q5PspH
— Tirumala Tirupati Devasthanams Updates (@TTD_TTD) June 15, 2023
కల్యాణోత్సవం సేవల కోసం..
ఈ నెల 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనున్నారు. అదే రోజున ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను కూడా విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. అదే రోజున (జూన్ 22) ఉదయం 10 గంటలకు పవిత్రోత్సవాల టికెట్లను కూడా ఆన్ లైన్ లో ఉంచనున్నారు. ఈ నెల 23 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.