Russia-Ukraine Crisis: ఎవ్వరి మాట వినని పుతిన్, ఆక్రమిత ప్రాంతాల్లోకి గత 12 గంటల్లో 10 వేల మంది సైన్యం తరలింపు, రష్యా బ్యాంకులపై ఆంక్షలు విధిస్తున్నామని తెలిపిన బ్రిటన్
వేలాది మంది రష్యన్ దళాలు ఇప్పటికే ఉక్రెయిన్‌లో (Russia-Ukraine Crisis) ఉన్నాయిని ఉక్రెయిన్ సైనిక వర్గాలు మంగళవారం హెచ్చరించాయి,
New Delhi, February 22: రష్యా- ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు రోజు రొజుకు మరింతగా క్షీణిస్తున్నాయి.తాజాగా రష్యా గత 12 గంటల్లో 10,000 మంది సైనికులను వివాదాస్పద ప్రాంతాలకు తరలించిందని ఉక్రెయిన్ సైనిక వర్గాలు పేర్కొన్నాయి. వేలాది మంది రష్యన్ దళాలు ఇప్పటికే ఉక్రెయిన్‌లో (Russia-Ukraine Crisis) ఉన్నాయిని ఉక్రెయిన్ సైనిక వర్గాలు మంగళవారం హెచ్చరించాయి. వ్లాదిమిర్ పుతిన్ తన బలగాలకు సరిహద్దును దాటాలని (Vladimir Putin Order) ఆదేశించిన కొద్ది గంటలకే, అతను దేశం యొక్క తూర్పున భూ-ఆక్రమణను ప్రారంభించబోతున్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
డొనెట్స్క్ మరియు లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా (Contested Areas in 12 Hours)గుర్తించిన తర్వాత రష్యా సైనిక ఉద్యమం 'దండయాత్ర' అని వైట్ హౌస్ అధికారి ప్రకటించడంతో ఇది జరిగింది. 10,000 కంటే ఎక్కువ మంది సైనికులు రాత్రిపూట వేర్పాటువాద-ఆక్రమిత ప్రాంతాలలోకి (Russia Has Moved Thousands of Troops) ప్రవేశించారు, ఉక్రేనియన్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌తో లింక్‌లు ఉన్న ఓ సంస్థ తెలిపింది. వీరిలో 6,000 మంది డోనెట్స్క్‌కు, 5,000 మంది లుహాన్స్క్‌కు మరియు 1,500 మంది హోర్లివ్కా నగరానికి పంపబడ్డారని తన కథనంలో తెలిపింది.
ఇప్పటికే ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డెనెట్స్క్, లూహాన్స్క్‌లను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తిస్తున్నామని, మిటరీ సహాయం కూడా అందిస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు వేర్పాటువాద నాయకులతో ఫైల్‌పై పుతిన్ సంతకం కూడా చేశారు.
ఉక్రెయిన్‌పై రష్యా చొరబాటు ప్రారంభమైందని బ్రిటన్ ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ సంచలన ప్రకటన చేశారు. రష్యాపై ఆంక్షలు విధించడానికి కూడా తమ ప్రభుత్వం సన్నద్ధమైపోయిందని ప్రకటించారు. ఉక్రెయిన్ సంక్షోభంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధ్యక్షతన ఓ అత్యవసర సమావేశం జరిగింది. అనంతరం బ్రిటన్ ప్రధాని బోరిక్ జాన్సన్ కీలక ప్రకటన చేశారు. రష్యాకు చెందిన కీలకమైన ఐదు బ్యాంకులపై ఆంక్షలు విధిస్తామని అధికారికంగా ప్రకటించారు. రోషియా బ్యాంక్, ఐఎస్ బ్యాంక్, జనరల్ బ్యాంక్, ప్రామ్స్‌వ్యాజ్ బ్యాంక్, బ్లాక్ సీ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి.
అంతేకాకుండా రష్యాకు చెందిన ముగ్గురు అత్యంత ధనవంతులపై కూడా ఆంక్షలు విధిస్తామని ప్రకటించారు. ఇందుకోసం పార్లమెంట్ నుంచి ప్రత్యేక అధికారాలను కూడా పొందామని పేర్కొన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో కూడా చెప్పలేమని కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా పరిగణిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కీలక ఘట్టం ముగిసిన తర్వాతే బ్రిటన్ ప్రధాని జాన్సన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రష్యాకి దన్నుగా నిలుస్తున్న ఉక్రెయిన్ తూర్పు వైపు ఉన్న తిరుగుబాటు ప్రాంతాలకు అమెరికా ఊహించని ఝలక్ ఇచ్చింది. ఆర్థిక ఆంక్షలతో పాటు రష్యా మీదా కొత్త ఆంక్షలను విధించనున్నట్లు ఇవాళ (మంగళవారం) ప్రకటించేసింది. ఆ రెండు ( డోనెట్‌స్క్, లుగన్‌స్క్) రెబల్ రాజ్యాలపై ఆంక్షలు విధించింది. ‘అంతర్జాతీయ చట్టాల కఠోరమైన ఉల్లంఘనలకు గానూ ప్రతిగా రష్యాకు ఒరిగే లాభాన్ని దూరం చేయడానికే(రెబల్స్‌తో ఒప్పందాన్ని ఉద్దేశించి) నేను ఈ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశా.
తక్షణమే ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయి. తదుపరి చర్యలపై ఉక్రెయిన్‌తో సహా మిత్రదేశాలు, భాగస్వాములతో అమెరికా సన్నిహితంగా సంప్రదింపులు జరుపుతోంది. ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై ఇవాళ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. ఉక్రెయిన్, అమెరికా, మెక్సికో, ఐదు యూరోపియన్ దేశాల విజ్ఞప్తి మేరకే ఈ సమావేశం నిర్వహించింది భద్రతా మండలి.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యవహరిస్తున్న తీరును రష్యా ప్రతిపక్ష నేత ఎలెక్సీ నెవెలనీ తూర్పురా పట్టారు. ఉక్రెయిన్ వల్ల కానీ, అమెరికా వల్ల గానీ రష్యాకు ప్రమాదం లేదని, అధ్యక్షుడు పుతిన్ వల్లే రష్యాకు అత్యధిక ప్రమాదమని ప్రతిపక్ష నేత తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ విషయంలో పుతిన్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 16 ట్వీట్లు చేస్తూ.. విరుచుకుపడ్డారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పాలన వల్లే దేశ ప్రజలు పేదలవుతున్నారని, అమెరికా వల్ల మాత్రం కాదని విమర్శించారు. పుతిన్, ఆయన మద్దతుదారులను అధికారం నుంచి తొలగించాలని, రష్యాను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విపక్ష నేత ఎలెక్సీ నెవెలనీ పేర్కొన్నారు. రష్యా సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఇలా చేస్తున్నారంటూ ఎలెక్సీ నెవెలనీ విమర్శించారు. రష్యాలో ఉన్న సమస్యలనుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఇలా చేస్తున్నారని, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని, ధరలు విపరీతంగా పెరిగాయని, వీటన్నింటి నుంచి దృష్టి మరలిస్తున్నారని ఆయన ఆరోపించారు.