Saulos Chilima Dies: మలావీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిస్సింగ్‌, సాలోస్‌ చిలిమాతో పాటు మరో 9 మంది మృతి, చికంగావా అడవుల్లో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్‌ శకలాలు గుర్తింపు

సావులోస్‌ చీలిమా(51)తో పాటు మరో తొమ్మిది మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్ష భవనం మంగళవారం ఉదయం ప్రకటించింది.

Aulos Klaus Chilima (Credits: X)

సోమవారం రాత్రి నుంచి ఆచూకీ లేకుండా పోయిన మలావి ఉపాధ్యక్షుడు సాలోస్‌ చిలిమా (Saulos Chilima) ఉదంతం విషాదకరంగా ముగిసింది. సావులోస్‌ చీలిమా(51)తో పాటు మరో తొమ్మిది మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్ష భవనం మంగళవారం ఉదయం ప్రకటించింది. చికంగావా పర్వత శ్రేణిలో చిలిమా ప్రయాణిస్తున్న విమానం కూలిందని మలావి మీడియా సంస్థలు తెలిపాయి.

సోమవారం ఓ అధికారిక కార్యక్రమం కోసం ఆయన నేతృత్వంలోని బృందంగా బయల్దేరగా.. కాసేపటికే రాడార్‌ నుంచి ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంబంధాలు తెగిపోయింది. దీంతో.. భారీగా సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. అయితే ఈ ఉదయం విఫ్య పర్వతాల్లోని చికంగావా అడవుల్లో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్‌ శకలాలను గుర్తించారు. అందులో ఎవరూ సజీవంగా లేరని ఆ దేశ అధ్యక్ష భవనం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.  మలావిలో విమానం మిస్సింగ్.. ప్లేన్‌ లో మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది.. రాడార్‌ తో ప్లేన్ కి తెగిపోయిన సంబంధాలు.. కాంటాక్ట్ కోసం చేసిన ప్రయత్నాలు వృథా.. అంతటా టెన్షన్.. టెన్షన్

సోమవారం ఎంజుజు నగరంలో ఓ కేబినెట్‌ మాజీ మినిస్టర్‌ అంత్యక్రియల కోసం ఈ బృందం బయల్దేరింది. ఇందులో ఉపాధ్యక్షుడు సావులోస్‌తో పాటు మానవ హక్కుల సంఘం నేత, మలావీ మాజీ ప్రథమ పౌరురాలు షానిల్‌ జింబిరి కూడా ఉన్నారు. షెడ్యూల్‌ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు.

కాసేపటికే ఆ విమానం రాడార్ నుంచి మాయమైందని, దీంతో విమానయాన అధికారులు దాంతో కాంటాక్ట్‌ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ వెంటనే అన్ని దళాలు చికంగావా అడవుల్లో ఎయిర్‌క్రాఫ్ట్‌ కోసం గాలింపు చేపట్టగా.. తన బహమాస్‌ పర్యటనను రద్దు చేసుకుని మరీ ఈ సెర్చ్‌ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు.

సాలోస్‌ చిలిమా మరణం నేపథ్యంలో మలావి అధ్యక్షుడు లాజారస్‌ చక్వెరా ఈరోజును సంతాపదినంగా ప్రకటించారు. ఈ మేరకు మలావి అధ్యక్ష కార్యాలయం, క్యాబినెట్ కార్యాలయం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. ‘సోమవారం ఉదయం రాజధాని లిలాంగ్వే నుంచి బయలుదేరిన మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ కూలిన ఘటనలో దేశ ఉపాధ్యక్షుడు చిలిమాతోపాటు మరో 9 మంది దుర్మరణం పాలుకావడం బాధాకరం’ అని ఆ ప్రకటనల్లో పేర్కొన్నాయి.