Newdelhi, June 11: తూర్పు ఆఫ్రికా దేశం మలావిలో (Malawi) ఓ విమానం మిస్సింగ్ అయింది. మలావీ డిఫెన్స్ ఫోర్స్ కు చెందిన ఈ విమానం కనిపించకపోవడంతో అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది. కారణం ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమా (Malawi’s aulos Klaus Chilima) ఇందులో ఉండటమే. చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది కూడా విమానంలో ఉన్నట్టు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9:17 గంటలకు విమానం షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానానికి చేరుకోలేదు. దీంతో విమానం అదృశ్యమైనట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.
An aircraft carrying Malawi's vice president and nine others has gone missing, the country's presidency said https://t.co/ndQOARbwfd pic.twitter.com/9TVoyoJt6H
— Reuters (@Reuters) June 10, 2024
టేకాఫ్ అయిన కాసేపటికే..
టేకాఫ్ అయిన కాసేపటికే రాడార్ తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని, కాంటాక్ట్ కోసం ఏవియేషన్ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని మలావి అధ్యక్ష, కేబినెట్ కార్యాలయం ఒక ప్రకటనలో వివరించాయి. కాగా విమానం కోసం మలావి అన్వేషణ కొనసాగుతోంది. సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్‌కు అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. కాగా విమానం మిస్సింగ్‌కు కారణం ఇంకా తెలియరాలేదు.