Sawasdee PM Modi: బ్యాంకాక్‌లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం, మూడు రోజుల పాటు టూర్, సవస్దీ పీఎం మోడీలో ప్రధాని ప్రసంగం, థాయ్‌లాండ్‌కు ఇది నా మొదటి అధికారిక పర్యటన అంటూ ప్రారంభం
మొత్తం మూడు రోజుల పాటు ప్రధాని మోడీ థాయ్‌లాండ్ టూర్ కొనసాగనుంది.
Bangkok, November 3: భారత్-థాయ్‌లాండ్ (Thailand) మధ్య చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగప్వామ్యం చర్యలు ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రధాని మోడీ బ్యాంకాక్ చేరుకున్నారు. మొత్తం మూడు రోజుల పాటు ప్రధాని మోడీ థాయ్‌లాండ్ టూర్ కొనసాగనుంది. పర్యటనలో భాగంగా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్ సదస్సు, రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్ నర్ షిప్ సమ్మిట్లలో మోడీ పాల్గొననున్నారు. బ్యాంకాక్ లో సవస్దీ పీఎం మోడీ ( Sawasdee PM Modi) కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. భారత ఎంబసీ పర్యవేక్షించే ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తున్నారు.
థాయ్‌లాండ్‌కు ఇది నా మొదటి అధికారిక పర్యటన. ఈ రోజు, థాయిలాండ్ కొత్త రాజు పాలనలో, నా స్నేహితుడు ప్రధాన మంత్రి ప్రయూత్ చాన్ ఓచ్ ఆహ్వానం మేరకు భారత-ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి నేను ఇక్కడకు వచ్చాను అని మోడీ అన్నారు.
ప్రధాని మోడీ ప్రసంగం లైవ్
సవస్దీ అంటే థాయ్ భాషలో శుభాకాంక్షలు చెప్పడం లేదా వీడ్కోలు చెప్పడం. ఈ సవస్దీ అనే పదం సంస్కృతంలోని ‘స్వస్థి’ అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు. స్వస్థి అంటే శ్రేయస్సు అని అర్థం.
మోడీకి ఘనస్వాగతం
ఈ సందర్భంగా సిక్కుల మత గురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం నాణేన్ని విడుదల చేస్తారు. మరోవైపు థాయ్ భాషలో అనువదించిన ప్రసిద్ధ తమిళ గ్రంథం తిరుక్కురల్‌ను ఆవిష్కరిస్తారు.