Serbia Shooting: క్లాసు రూంలో టీచర్లపై ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు జరిపిన విద్యార్థి, సెక్యురిటీ గార్డుతోపాటు ఎనిమిది మంది విద్యార్థులు మృతి

తన టీచర్‌పై క్లాస్‌రూమ్‌లోనే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అంతేగాక మిగతా విద్యార్థులు, సెక్యూరిటీగార్డుపై ఇష్టారీతిగా కాల్పులకు తెగబడ్డాడు.

Serbia Shooting: క్లాసు రూంలో టీచర్లపై ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు జరిపిన విద్యార్థి, సెక్యురిటీ గార్డుతోపాటు ఎనిమిది మంది విద్యార్థులు మృతి
Police officers secure area after 14-year-old boy opened fire in Belgrade (Image Credit: Reuters)

సెర్బియా దేశంలో ఓ పాఠశాలలో 14 ఏళ్ల విద్యార్థి తుపాకీతో వీరంగం సృష్టించాడు. తన టీచర్‌పై క్లాస్‌రూమ్‌లోనే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అంతేగాక మిగతా విద్యార్థులు, సెక్యూరిటీగార్డుపై ఇష్టారీతిగా కాల్పులకు తెగబడ్డాడు. సెర్బియా రాజధాని బెల్‌గ్రాడ్‌లోని వ్లాడిస్లావ్ రిబ్నికర్ ఎలిమెంటరీ స్కూల్‌లో బుధవారం ఈ ఘోరం వెలుగు చూసింది.

పాకిస్థాన్‌లో స్కూలులో కాల్పులు, ఎనిమిది మంది ఉపాధ్యాయులు అక్కడికక్కడే మృతి, స్టాఫ్‌రూమ్‌లోకి ప్రవేశించి విచ్చలవిడిగా కాల్పులు జరిపిన దుండగుడు

ఈ ఘటనలో ఇప్పటివరకు సెక్యురిటీ గార్డుతోపాటు ఎనిమిది మంది విద్యార్థులు మరణించినట్లు సెర్బియా హోంమంత్రిత్వశాఖ పేర్కొంది. టీచర్‌తోపాటు పాటు ఆరుగురు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. కాల్పులకు తెగబడిన విద్యార్థిని అరెస్టు చేశారు. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

ముందుగా టీచర్‌పై కాల్పులు జరిపి తరువాత మిగతా విద్యార్థులపై కాల్పులు జరిపినట్లు క్లాస్‌లోని విద్యార్థుల్లో ఓ చిన్నారి తండ్రి చెప్పారు. అయితే తన కూతురుకు ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif