16 Insects For Human Consumption: పురుగులు, మిడతలు, గొల్లభామలు.. ఇలా 16 రకాల పురుగులను తినేయొచ్చు.. సింగపూర్ ప్రభుత్వం అనుమతి. ఎందుకంటే?
అయితే కేవలం అక్కడి వారు మాత్రమే ఇలాంటి ఆహారాన్ని తింటారని అనుకోకండి.
Newdelhi, July 9: కప్పలు (Frogs), పాములను (Snakes) చైనీయులు, కొరియన్లు తినడం చాలా సర్వసాధారణం. అయితే కేవలం అక్కడి వారు మాత్రమే ఇలాంటి ఆహారాన్ని తింటారని అనుకోకండి. ఇప్పుడు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ చేసిన ప్రకటనతో అక్కడి హోటల్స్, రెస్టారెంట్లు పండగ చేసుకుంటున్నాయి. ఎందుకంటే పురుగులు, మిడతలు, గొల్లభామలు సహా 16 రకాల కీటకాలను మానవ ఆహారంగా వినియోగించుకునేందుకు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (Singapore Food Agency) ఆమోదం తెలిపింది.
ఎందుకంటే?
మిడతలు, గొల్లభామల వంటి జీవుల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయని, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఆహారంగా వీటిని తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఒంటరి పెండ్లి.. సోలో హనీమూన్.. జపాన్ లో ఇప్పుడిదే ట్రెండింగ్.. అసలేంటి ఇది??