South Korea Plane Crash Update: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179కి చెందిన మృతుల సంఖ్య (వీడియో)

దక్షిణకొరియాలో కుప్పకూలిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 179 మందికి చేరింది.

Plane Crash (Credits: X)

Newdelhi, Dec 29: దక్షిణకొరియాలో కుప్పకూలిన విమాన ప్రమాదంలో (South Korea Plane Crash) మృతుల సంఖ్య 179 మందికి చేరింది. అసలేం జరిగిందంటే.. ప్యాసింజర్లు, సిబ్బంది కలిపి మొత్తం 181 మందితో థాయ్‌ లాండ్ నుంచి వస్తున్న ‘జెజు ఎయిర్ ఫ్లైట్ 2216’  విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడి పేలిపోయింది. సౌత్ జియోల్లా ప్రావిన్స్‌ లోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ప్రమాదంలో 179 మంది మృతి చెందినట్టు తేల్చారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది. ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.

వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. దక్షిణ కొరియాలో తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం.. 29 మంది మృతి.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం.. ప్రమాద సమయంలో విమానంలో 181 మంది (వీడియో)

కారణం అదేనా?

విమానం ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతోనే రన్ వే గోడకు తాకి విమానం ప్రమాదానికి గురైనట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. విమానం ల్యాండ్ అయ్యి రన్‌పై కొద్దిదూరం ప్రయాణించిన తర్వాత ఒక్కసారిగా పొగలు వెలువడి పెద్ద పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయి.

రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం, రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని కండీషన్