Terrorists Didn't Land From Moon:ఉగ్రవాదంపై ఇండియాదే కరెక్ట్ దారి, టెర్రరిస్టులు పాక్ నుంచి కాకుండా చంద్రుని మీద నుంచి వస్తున్నారా..? పాకిస్తాన్‌కు షాకిచ్చిన మెజారిటీ దేశాలు
దీనిని ఖండించాలని పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ప్రపంచదేశాల చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ ప్రపంచదేశాల నుంచి ఆయనకు ఏ మాత్రం మద్ధతు లభించడం లేదు. సరికదా స్వంత దేశంలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
Brazil,September 19: ఆర్టికల్ 370 రద్దుతో ఇండియా ( India ) పాకిస్తాన్ ( Pakistan ) మీద ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీనిని ఖండించాలని పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ( Imaran Khan ) ప్రపంచదేశాల చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ ప్రపంచదేశాల నుంచి ఆయనకు ఏ మాత్రం మద్ధతు లభించడం లేదు. సరికదా స్వంత దేశంలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ కు కశ్మీర్ అంశంలో మరోసారి అంతర్జాతీయంగా ఎదురుదెబ్బతగిలింది. జమ్మూ కశ్మీర్‌పై భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని యూరోపియన్ పార్లమెంట్ ( European parliamentarians) కొనియాడింది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో మెజారిటీ దేశాలు భారత్ చర్యలను సమర్ధించాయి.తాజాగా ఐరోపా సమాఖ్య కూడ భారత్‌కు మద్దతు పలికింది.
ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని, తామెప్పుడూ వారికి అండగా ఉంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు యూరోపియన్ పార్లమెంట్ ప్లీనరీ సమావేశంలో సభ్యులు రిస్జార్డ్ జార్నెక్కి, ఫుల్వియో మార్టుసిఎల్లో ఉగ్రవాదంపై సుధీర్ఘ ప్రసంగం చేశారు.
ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతున్న రిస్జార్డ్ జార్నెక్కి
దాదాపు 12 సంవత్సరాల తరువాత బ్రస్సెల్స్‌లో సమావేశమైన ఐరోపా దేశాల సమఖ్య కశ్మీర్ అంశంపై చర్చ చేపట్టింది. కశ్మీర్ అంశంలో భారత్‌ను అంతర్జాతీయ సమాజంలో నిలబెట్టాలని పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే ఆ దేశానికి మరోసారి షాక్ తగిలింది. కశ్మీర్ లో మానవ హక్కులు హరించుకుపోతున్నాయని ఆరోపణలు చేస్తూ ఐరాసకు పాకిస్తాన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఐరాస భద్రతా మండలి సమావేశం అత్యవసర సమావేశం నిర్వహించి సంగతి విదితమే. కాగా పాకిస్తాన్ ఆశించినట్టుగా ఐరాస దేశాల నుండి మద్దతు లభించ లేదు.
సమావేశంలో వారు మాట్లాడుతూ..‘ప్రపంచంలో భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కశ్మీర్‌లో గతకొంత కాలంగా ఉగ్రవాదులు పాల్పడుతున్న ఆకృత్యాలను తాము చూస్తూనే ఉన్నాం. వారంతా భారత్ సరిహద్దు దేశం (పాక్) నుంచే ప్రవేశిస్తున్నారు. చంద్రుడి నుంచి కాదు. ఉగ్రవాదాన్ని అణచివేసే అంశంలో తామెప్పుడూ భారత్‌కు అండగా నిలుస్తాం’ అని వ్యాఖ్యానించారు. భారత్‌లోకి ఉగ్రవాదులు సరిహద్దు దేశం నుంచే ప్రవేశిస్తున్నారని, చంద్రుడి మీద నుంచి కాదని ( Terrorists Didn't Land from Moon) పరోక్షంగా పాక్‌పై మండిపడ్డారు. ,జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రదాడులను పరిగణలోకి తీసుకొని ఇండియాకు మద్దతుగా నిలవాల్సిన అవసరముందని అన్నారు. దీంతోపాటు కశ్మీర్ అంశం ఇరుదేశాలకు సంబంధించిన అంశమని శాంతీయుత చర్చల ద్వార పరిష్కరించుకోవాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించింది.