‘‘He Died Like A Dog’’: బాగ్దాదీ కుక్క చావు చచ్చాడు, పిరికివాడిలా ఏడుస్తూ తనంతట తానే పేల్చుకున్నాడు, మొత్తం ఆపరేషన్ నేను చూశాను, వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్

ఆదివారం శ్వేతసౌధంలో ఆయన మాట్లాడుతూ బాగ్దాదీ మరణించాడని తనంతట తానే పేల్చుకుని చనిపోయాడని తెలిపారు.

Trump-confirms-coward-ISIS-leader-Abu-Bakr-al-Baghdadi-killed (Photo-IANS and getty)

Washington, October 28: ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్-బాగ్దాదీ కుక్క చావు చచ్చాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆదివారం శ్వేతసౌధంలో ఆయన మాట్లాడుతూ బాగ్దాదీ మరణించాడని తనంతట తానే పేల్చుకుని చనిపోయాడని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత హింసాత్మక ఉగ్రవాద సంస్థ ఐసిస్ వ్యవస్థాపకుడు బాగ్దాదీ కోసం యూఎన్ ఎన్నో సంవత్సరాలుగా జల్లెడపడుతోంది. అతడిని వెతికి పట్టుకోవడమే లక్ష్యంగా అమెరికా గత కొద్ది సంవత్సరాల నుంచి పనిచేస్తోంది. ఎట్టకేలకు అమెరికా దళాలు ఆ ఆపరేషన్ పూర్తి చేశాయి.

అమెరికా సైన్యం బాగ్దాదీ ఉన్న ప్రదేశాన్ని గుర్తించి మెరుపు దాడులు చేయడంతో అతను పిరికివాడిలా పారిపోయాడని ఏడుస్తూ తనంతట తాను పేల్చుకుని చనిపోయాడని ట్రంప్ తెలిపారు. చివరకు అతను కుక్కచావు చచ్చాడని ఆయన అన్నారు. ఈ ఆపరేషన్‌ మొత్తాన్ని తాను తిలకించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

మీడియా సమావేశంలో ట్రంప్ 

బాగ్దాదీ మృతి గురించి కొద్ది సమయం కిందటే పరోక్షంగా ట్వీట్ చేసిన ట్రంప్, వైట్ హౌజ్‌లో మీడియా ముందు మరోసారి ధ్రువీకరించారు. బాగ్దాదీ ఆత్మాహుతి చేసుకున్నాడని, డీఎన్‌ఏ టెస్ట్‌లు కూడా బాగ్దాదీ మృతిని ధృవీకరించాయని ట్రంప్ స్పష్టం చేశారు. బాగ్దాదీతో పాటు అతని ముగ్గురు పిల్లలు చనిపోయారని, అయితే తమ (అమెరికా) సైనికుల్లో ప్రాణహాని జరగలేదని ట్రంప్ అన్నారు. ఐసిస్‌కు సంబంధించిన కీలక సమాచారం సేకరించామని పేర్కొన్నారు.  డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ సారాశం ఇదేనా

దాడి సమయంలో బాగ్దాదీ సొరంగంలో దాక్కున్నాడని చెప్పిన ఆయన రెండు గంటల పాటు ఆపరేషన్‌ జరిగిందని ప్రకటించారు. అమెరికా బలగాలను ఎదుర్కోలేననే భయంతోనే తనను తాను బాంబుతో పేల్చుకుని తనువు చాలించినట్లు పేర్కొన్నారు. పేలుడు వల్ల అతడి శరీరం తునాతునకలైందని, డీఎన్ఏ టెస్టుల ద్వారా ధ్రువీకరించామని ట్రంప్ తెలిపారు.

ట్రంప్ ఆసక్తికర ట్వీట్ 

గతంలో కూడా రెండు మూడు సార్లు లక్ష్యానికి సమీపంలోకి వెళ్లినప్పటికీ... బగ్దాదీ తన స్థావరాలను మార్చుకోవడం వల్ల తృటిలో తప్పించుకున్నారని ట్రంప్ తెలిపారు. ఇటీవలే ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్‌ను మేం హతమార్చామని ట్రంప్ గుర్తుచేశారు. తమ లక్ష్యం పూర్తి చేసిన అమెరికా సైన్యం ఈశాన్య సిరియా నుంచి వైదొలుగుతుందని ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు.