US House Bans TikTok: అమెరికా కీలక నిర్ణయం, ప్రభుత్వ డివైజ్‌లలో టిక్‌ టాక్‌ను బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటన, మార్గదర్శకాల్ని విడుదల చేసిన యూఎస్ హౌస్

అమెరికా ప్రభుత్వ డివైజ్‌లలో టిక్‌ టాక్‌ను బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.అందుకు సంబంధించి మార్గదర్శకాల్ని విడుదల చేసింది.

Representative Image

New York, De 28: భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రభుత్వ డివైజ్‌లలో టిక్‌ టాక్‌ను బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.అందుకు సంబంధించి మార్గదర్శకాల్ని విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు టిక్‌ వినియోగించే అవకాశం కోల్పోనున్నారు. బైట్‌ డ్యాన్స్‌ సంస్థకు చెందిన టిక్‌టాక్‌ వినియోగడంతో సెక్యూరిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయని అమెరికా ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది.

వచ్చే ఏడాది నుంచి BSNL 5జీ సేవలు, దేశవ్యాప్తంగా 80 శాతం మేరకు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

ముందస్తు చర్యల్లో భాగంగా అమెరికా కాంగ్రెస్‌లో హౌస్‌ ఆఫ్‌ రెప్రజెంటేటివ్స్‌ (ప్రతినిధుల సభ) టిక్‌ టాక్‌ను వినియోగించకుండా నిషేధం విధిస్తూ హౌస్‌ చీఫ్‌ అడ్మినిస్ట్రేటీవ్‌ ఆఫీసర్‌ (సీఏఓ) చట్టసభ సభ్యులు, ఇతర సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు టిక్‌ టాక్‌ను వినియోగించేందుకు అనువుగా ఉండే అన్నీ డివైజ్‌లలో యాప్‌ను డిలీట్‌ చేయాలని కోరారు.

మనుషులకు పంది కాలేయాన్ని అమర్చే ప్రయోగాలు, అమెరికాలో గత 12 ఏళ్ల నుంచి శరవేగంగా జరుగుతున్న ట్రయల్స్

ఇప్పటికే గత వారం టిక్‌ టాక్‌ యాప్‌ సాయంతో అమెరికన్లు, ఇతర అంతర్గత సమాచారాన్ని ట్రాక్‌ చేస్తుందని 19 రాష్ట్ర ప్రభుత్వాలు..గవర్నమెంట్‌కు చెందిన డివైజ్‌లలో మాత్రమే యాప్‌ను వినియోగించకుండా తాత్కాలికంగా బ్లాక్‌ చేశాయి.