Maldives Parliament Brawl Video:మాల్దీవ్స్ పార్లమెంట్ లోప‌ల కొట్టుకున్న ఎంపీలు, ఒక‌రిపై ఒక‌రు పిడిగుద్దుల‌తో విరుచుకుప‌డ్డ స‌భ్యులు, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ఎంపీల కొట్లాట‌

ప్రతిపక్ష ఎంపీలు స్పీకర్‌ను అడ్డుకోవడంతో సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మాల్దీవుల పార్లమెంట్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది. (Ugly Fighting Scenes In Maldives Parliament) మాల్దీవుల ఎంపీల అగ్లీ ఫైటింగ్ వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Maldives Parliament Brawl (PIC@ X)

Male, JAN 28: మాల్దీవుల పార్లమెంట్‌లో సభ్యులు కొట్టుకున్నారు. ప్రతిపక్ష ఎంపీలు స్పీకర్‌ను అడ్డుకోవడంతో సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మాల్దీవుల పార్లమెంట్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది. (Ugly Fighting Scenes In Maldives Parliament) మాల్దీవుల ఎంపీల అగ్లీ ఫైటింగ్ వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ముయిజు నేతృత్వంలోని కేబినెట్ ఆమోదానికి పార్లమెంట్‌ కీలక సమావేశం ఆదివారం జరిగింది. కొంత మంది నామినేటెడ్‌ మంత్రుల ఎంపికపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

కాగా, పార్లమెంట్‌లో మెజార్టీ ఉన్న మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ (MDP), డెమొక్రాట్‌లు నలుగురు కేబినెట్‌ మంత్రుల ఎంపికను తీవ్రంగా వ్యతిరేకించారు. వారి ఎన్నిక ఆమోదం కోసం జరిగిన ఓటింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

పార్లమెంట్ సమావేశాన్ని కొనసాగించకుండా స్పీకర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

 

మరోవైపు స్పీకర్‌ చాంబర్‌లోకి ప్రవేశించిన విపక్ష సభ్యులు అక్కడ హంగామా చేశారు. ఈ నేపథ్యంలో అధికార ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (PPM), పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNC)కు చెందిన సంకీర్ణ ప్రభుత్వం సభ్యులు విపక్ష సభ్యులపై భౌతిక దాడులకు దిగారు. దీంతో మాల్దీవుల పార్లమెంట్‌లో ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. ఈ వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.