Omicron in UK: యూకేలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విలయం, 12కు చేరిన మరణాల సంఖ్య, ఆదివారం ఒక్కరోజే 12,133 కేసులు నమోదు

ముఖ్యంగా బ్రిటన్ లో ఒమిక్రాన్ (Omicron in UK) ఆందోళనకరంగా మారింది. ఆదివారం ఒక్కరోజే 12,133 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నమోదైన కేసులు 3,201తో పోలిస్తే ఇది మూడు రెట్లు కావడం గమనార్హం.

Coronavirus in US (Photo Credits: PTI)

London, Dec 21: యూకేలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ అత్యంత వేగంగా విస్తరిస్తున్నది. ముఖ్యంగా బ్రిటన్ లో ఒమిక్రాన్ (Omicron in UK) ఆందోళనకరంగా మారింది. ఆదివారం ఒక్కరోజే 12,133 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నమోదైన కేసులు 3,201తో పోలిస్తే ఇది మూడు రెట్లు కావడం గమనార్హం. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు బ్రిటన్‌లో ఒమిక్రాన్‌ (Omicron Scare in UK) బారిన పడ్డవారి సంఖ్య 37,101కు పెరిగింది. మొత్తంగా చూస్తే బ్రిటన్‌లో ఆదివారం 82,886 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

బ్రిటన్‌లో 12 మంది కరోనావైరస్ యొక్క ఓమిక్రాన్ వేరియంట్‌తో మరణించారు, బ్రిటన్ డిప్యూటీ ప్రధాన మంత్రి డొమినిక్ రాబ్ సోమవారం చెప్పారు. ఓమిక్రాన్, గత నెలలో దక్షిణాఫ్రికా మరియు హాంకాంగ్‌లో మొదటిసారిగా కనుగొనబడింది, ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పటివరకు కనీసం 89 దేశాలలో నివేదించబడింది. 12 మరణాలతో పాటు, 104 మంది ప్రస్తుతం ఓమిక్రాన్‌తో ఆసుపత్రిలో ఉన్నారని రాబ్ చెప్పారు. ఒమిక్రాన్‌ నేపథ్యంలో క్రిస్‌మస్‌ వేడుకలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని బ్రిటన్‌ ఆరోగ్యమంత్రి సాజిద్‌ జావిద్‌ చెప్పారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు.

అమెరికాలో ఒమిక్రాన్ విలయం, తొలి మరణం నమోదు, అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో కరోనా కలకలం, అగ్రరాజ్యాన్ని రెడ్‌ లిస్ట్‌లో పెట్టిన ఇజ్రాయెల్

ఒమిక్రాన్‌ చాలా వేగంగా వ్యాపిస్తున్నదని పేర్కొన్నారు. కాగా, యూకే నుంచి వచ్చే వారిపై జర్మనీ నిబంధనలను కఠినతరం చేసింది. వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేసింది.