US Elections Results 2024: అందుకే ఆ చావు నుంచి దేవుడు నన్ను కాపాడాడు, విజయాన్ని ఉద్దేశిస్తూ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు, ఎన్ని కేసులు ఉన్నా ట్రంప్‌కే జై కొట్టిన అమెరికన్లు
అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విజయోత్సవ ప్రసంగాన్ని ప్రారంభించారు. ముందుగా ‘అందరికీ ధన్యవాదాలు’ అంటూ ప్రారంభించారు. అమెరికాకు మంచి రోజులు వచ్చాయని, స్వర్ణయుగం రాబోతోందని ట్రంప్ తన విజయాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు
US Election Results LIVE Updates: అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విజయోత్సవ ప్రసంగాన్ని ప్రారంభించారు. ముందుగా ‘అందరికీ ధన్యవాదాలు’ అంటూ ప్రారంభించారు. అమెరికాకు మంచి రోజులు వచ్చాయని, స్వర్ణయుగం రాబోతోందని ట్రంప్ తన విజయాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్టోరల్ ఓట్లతో పాటు పాపులర్ ఓట్లలోనూ తనకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయని చెప్పారు.
తన గెలుపుతో అమెరికాకు మేలు జరుగుతుందని, తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని చెప్పారు. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ ఓట్లకు చేరువలో ఉన్న ట్రంప్.. తనకు మొత్తం 315 కు పైగా ఎలక్టోరల్ ఓట్లు వస్తాయని చెప్పారు. స్వింగ్ రాష్ట్రాలలో ఊహించిన దానికన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని, అమెరికా ప్రజలు ఇంతటి విజయాన్ని ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతుందని, ఈ ఎన్నికల యుద్ధంలో(US Elections Results 2024) రిపబ్లికన్లు పోరాడారని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రచారంలో తనపై జరిగిన హత్యాయత్నం ఘటననూ ట్రంప్ ప్రస్తావించారు. ‘అమెరికాకు, అమెరికన్లకు సేవ చేయడానికే (God Spared My Life for a Purpose) దేవుడు నా ప్రాణాలు కాపాడాడని చాలామంది నాతో చెప్పారు. ఆ రోజు జరిగిన హత్యాయత్నం నుంచి తనను ప్రాణాలతో బయటపడేయడం వెనకున్న కారణం ఇదే. దేశాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాపై ఉందనే కాపాడాడు. ఇప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చే సమయం వచ్చింది. దేశానికి సేవ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మీరు, నేను, మనమంతా కలిసి అమెరికాను గ్రేట్ గా తీర్చిదిద్దుకుందాం’ అంటూ ట్రంప్ భావోద్వేగానికి గురయ్యారు.
అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లు అద్భుతంగా పోరాడారని, అదే పోరాటపటిమతో దేశాన్ని మరోమారు అద్భుతంగా తీర్చిదిద్దుకుందామంటూ తన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదం చేశారు. ఈ సందర్భంగా తన గెలుపునకు కృషి చేసిన టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ను ఈ సందర్భంగా ప్రశంసలతో ముంచెత్తారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.
తన మద్దతుదారులు చప్పట్లతో అభినందనలు తెలుపుతుండగా సతీమణి మెలానియా, చిన్న కుమారుడు బారన్‌తో కలిసి ట్రంప్ వేదిక పైకి వచ్చారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ‘‘ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు నిర్వహించిన ప్రచారం అతిపెద్ద రాజకీయ ఉద్యమం. అమెరికా గతంలో ఎన్నడూ చూడని విజయాన్ని మనం దక్కించుకున్నాం. ఈసందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపై ప్రతిక్షణం మీ కోసం, మీ కుటుంబం కోసం పోరాటం చేస్తాను. రాబోయే రోజుల్లో సరిహద్దుల సమస్యను పరిష్కరించనున్నాం’’ అని మాట్లాడారు.
వచ్చే నాలుగేళ్లలో అమెరికా తలరాతను నిర్ణయించే స్వింగ్ స్టేట్స్.. ఈ ఎన్నికల్లో ముక్తకంఠంతో రిపబ్లికన్ల (Republican Party)కు జైకొట్టాయి. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం ఏడు కీలక రాష్ట్రాల్లో మూడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వశమవ్వగా.. మిగతా నాలుగు చోట్లా ఆయనే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్, మిషిగన్, ఆరిజోనా, నెవడాలో ట్రంప్ ఖాతాలో పడ్డాయి.
78 ఏళ్ల ట్రంప్‌పై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒక దాంట్లో ఆయన దోషిగా తేలారు. మరో మూడు వారాల్లో ఆయనకు ఆ కేసులో శిక్ష పడాల్సి ఉన్నది. ఇంకా ఆయనపై అనేక సివిల్ కేసులు ఉన్నాయి. గడిచిన 8 ఏళ్లలో అనేక కుంభకోణాల్లో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినా అందర్నీ స్టన్ చేస్తూ రెండోవసారి అమెరికా దేశాధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించబోతున్నారు. అమెరికా రాజకీయాల్లోనే ట్రంప్ విజయం ఓ అసాధారణ ఫీట్‌గా నిలువనున్నది.
2016 ఎన్నికల్లో తొలిసారి ట్రంప్ దేశాధ్యక్షుడిగా విజయం సాధించారు. 2020 ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఆయన ఓడిపోయారు. కానీ ఎన్ని కేసులు ఉన్నా.. రెండోసారి అధ్యక్ష పీఠం కోసం ట్రంప్ పోరాడిన తీరు సంక్లిష్టమైంది. మేక్ అమెరికా గ్రేట్ వన్స్ అగైన్ నినాదంతో ట్రంప్ ఈ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే 2020లో బైడెన్ చేతిలో ఓడిన ట్రంప్.. రెండో సారి దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది. వరుసగా కాకుండా.. రెండోసారి దేశాధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్న రెండవ దేశాధ్యక్షుడిగా ట్రంప్ రికార్డు క్రియేట్ చేయనున్నారు. 1892లో గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ రెండోసారి(నాన్‌కాంజిక్యూటివ్) బాధ్యతలు చేపట్టారు.
దేశాధ్యక్ష అభ్యర్థిగా మళ్లీ పోటీ చేయనున్నట్లు 2022, నవంబర్ 15వ తేదీన ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత బైడెన్, ట్రంప్ మధ్య డిబేట్ జరిగింది. కానీ ఆ చర్చలో బైడెన్ విఫలం అయ్యారు. దీంతో ఆయనపై వత్తిడి పెరిగింది. అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని బైడెన్‌పై డెమోక్రాట్లు వత్తిడి తెచ్చారు. ఆ తర్వాత కమలా హ్యారిస్ రేసులో నిలిచారు. అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ ప్రకటించిన తర్వాత.. ట్రంప్‌పై రెండుసార్లు హత్యాయత్నం ప్రయత్నం జరిగింది.
పెన్సిల్వేనియాలో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో.. ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఓ బుల్లెట్ ట్రంప్ చెవిని చీల్చింది. ఇక ఫ్లోరిడా గోల్ఫ్‌కోర్సులో ఓ వ్యక్తి ఏకే 47తో పట్టుబడ్డారు. ట్రంప్‌ను హత్య చేసేందుకు ఆ వ్యక్తి వచ్చినట్లు గుర్తించారు. హత్యాయత్నం జరిగిన పెన్సిల్వేనియా రాష్ట్రానికి వెళ్లి.. అక్కడ ఉన్న మెక్‌డోనాల్డ్స్ స్టోర్‌లో ట్రంప్ సర్వ్ చేశారు. ట్రంప్ మద్దతుదారులను చెత్తతో పోల్చారు బైడెన్. దీంతో ట్రంప్ ఓ గార్బేజ్ వాహనాన్ని ఎక్కి నడిపారు. ఇక ఎన్నికల కోసం బిలియనీర్ మస్క్ .. రిపబ్లికన్ నేతకు సపోర్టు ఇచ్చారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)