IPL Auction 2025 Live

TikTok Ban in US: టిక్‌ టాక్ ను బ్యాన్ చేసిన అమెరికా, బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన అమెరికా ప్రతినిధుల సభ, బిల్లు తయారీలో కీలకంగా భారత సంతతి సభ్యులు

352 మంది బిల్లుకు మద్దతుగా ఓటేశారు. 65 మంది మాత్రమే వ్యతిరేకించారు. తర్వాత ఇది సెనేట్‌కు చేరనుంది.

Representative Image

Washington, March 14: చైనాకు చెందిన సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ (TikTok ban in USA ) నిషేధానికి సంబంధించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదించింది. 352 మంది బిల్లుకు మద్దతుగా ఓటేశారు. 65 మంది మాత్రమే వ్యతిరేకించారు. తర్వాత ఇది సెనేట్‌కు చేరనుంది. ‘విదేశీ నియంత్రిత యాప్‌ల నుంచి అమెరికన్లకు రక్షణ’ పేరిట తీసుకొచ్చిన దీన్ని భారత సంతతికి చెందిన డెమోక్రాటిక్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ప్రతినిధి మైక్‌ గల్లాఘే కలిసి రూపొందించారు. ‘‘ఈ బిల్లు టిక్‌టాక్ నిషేధానికి సంబంధించింది కాదు. దాన్ని నియంత్రిస్తున్న బైట్‌డ్యాన్స్‌ (ByteDance) గురించి. టిక్‌టాక్‌ యాజమాన్యం పూర్తిగా దాని చేతిలోనే ఉంది. ఆ కంపెనీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CCP) అధీనంలో పనిచేస్తోంది. బైట్‌డాన్స్ ఎడిటర్-ఇన్-చీఫ్ సీసీపీలో అత్యున్నత హోదాలో ఉన్నారు. అంటే పరోక్షంగా టిక్‌టాక్‌ను సీసీపీ నియంత్రిస్తోంది. టిక్‌టాక్‌ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. కానీ, సీసీపీ నియంత్రణలో మాత్రం కాదు. అందుకే టిక్‌టాక్‌ నుంచి బైట్‌డ్యాన్స్‌ దాని మెజారిటీ వాటాలను ఉపసంహరించుకోవాలి. బిల్లులో ఈ అంశాలను మాత్రమే పొందుపర్చాం’’ అని కృష్ణమూర్తి వివరించారు.

సీపీపీ నియంత్రణలోని టిక్‌టాక్‌ అమెరికాలో కార్యకలాపాలు కొనసాగించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మాజీ ఉపాధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధి మైక్‌ పెన్స్‌ అన్నారు. సెనేట్‌ దీనికి వెంటనే ఆమోదం తెలిపి అధ్యక్షుడు బైడెన్‌కు పంపాలని సూచించారు. ఈ బిల్లు ఆమోదంతో టిక్‌టాక్‌పై నిషేధం విధించబోతున్నట్లు కాదని మాజీ స్పీకర్‌ నాన్సీ పెలోసీ అన్నారు. దేశ భద్రత, సమాచార గోప్యతను కాపాడేందుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని మాత్రమే సూచిస్తోందన్నారు. టిక్‌టాక్‌ వల్ల ప్రయోజనాలూ ఉన్నాయని తెలిపారు. కానీ.. దాని అల్గారిథమ్‌. అందులో నిక్షిప్తమయ్యే సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లొద్దనే ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకొచ్చామని వివరించారు.

Saudi Arabia: షార్ట్స్ ధరించే పురుషులకు మసీదులోకి నో ఎంట్రీ, సౌదీ అరేబియా కీలక నిర్ణయం, మహిళలు హిజాబ్ ధరించి మసీదుకు రావాలని ప్రకటన 

ప్రపంచంలో టిక్‌టాక్‌ను (TikTok) నిషేధించిన తొలి దేశం భారత్‌. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని.. వ్యక్తులపై నిఘా పెడుతోందని గుర్తించిన ప్రభుత్వం 2020లోనే ఈ యాప్‌పై చర్యలు తీసుకుంది. ఆ తర్వాత పలు దేశాలూ అదే బాటలో పయనించాయి. అమెరికాలోనూ ట్రంప్ హయాంలో దీని నిషేధంపై చర్చ జరిగింది. తాజాగా ఆయన ఈ విషయంలో మాట మార్చారు. టిక్‌టాక్‌ నిషేధం వల్ల ఫేస్‌బుక్‌ అయాచిత లబ్ధి పొందుతుందనేది ఆయన వాదన. అయితే, తాజాగా ఆయన సొంత పార్టీ నుంచి మెజారిటీ సభ్యులు ప్రతినిధుల సభలో బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం.

China Restaurant Blast Video: చైనాలో భారీ పేలుడు, రెస్టారెంట్లో గ్యాస్ పేలి చెలరేగుతున్న మంటలు, చుట్టుపక్కల భవనాలు, వాహనాలు పూర్తిగా ధ్వంసం (వీడియో ఇదుగో) 

టిక్‌టాక్‌కు (TikTok) అమెరికాలో 150 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు. దీన్ని చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ యాప్‌ వద్ద ఉన్న అమెరికన్ల సమాచారం చైనా చేజిక్కించుకునే అవకాశం ఉందని కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో బైట్ డ్యాన్స్‌ సంస్థ టిక్‌టాక్‌ను అమ్మేయాలని అమెరికా ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. లేదంటే దానిపై నిషేధం విధిస్తామని హెచ్చరించింది. తాజాగా ఆ దిశగా రూపొందించిన బిల్లు ప్రతినిధుల సభలో నెగ్గింది.